పవన్.. ఊర్జిత్ ను ఉతికి ఆరేశారు

పవన్.. ఊర్జిత్ ను ఉతికి ఆరేశారు

నోట్లరద్దుపై పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ ట్వీట్లు చేశారు. ఆర్బీఐ గవర్నర్ ఊర్జిత్ పటేల్ ను దులిపేశారు. అసలు దేశంలో ఆర్బీఐ పనిచేస్తుందా.. లేదా అన్న అనుమానం కలుగుతోందన్నారు. చచ్చిపోతున్న జనం సాక్షిగా.. మీరూ, మీబాస్ లు హాయిగా నిద్రపోండి అన్న పవన్ ట్వీట్.. సోషల్ మీడియాలో దుమారం రేపింది.
           
ప్రధాని మోడీ పేరెత్తని పవన్.. ఊర్జిత్ ను మాత్రం ఉతికి ఆరేశారు. ఏపీ, తెలంగాణలో ఎంతోమంది నోట్ల కోసం క్యూలో నుంచుని చనిపోయారని, వాళ్ల మరణానికి ఎవరు బాధ్యత వహిస్తారని పవర్ స్టార్ ప్రశ్నించారు. అసలు ముందస్తు ప్రణాళిక లేకుండా అంత హడావిడిగా నోట్ల రద్దు నిర్ణయం తీసుకుని ఏం సాధించారని నిలదీశారు.
       
చలామణిలో ఉన్న 86 శాతం కరెన్సీని ఒకేసారి ఉపసంహరించడం వివేకవంతలు లక్షణం కాదన్న పవన్.. బ్లాక్ మనీ వైటైపోతుందని ఎద్దేవా చేశారు. పాత నోట్ల స్థానంలో నల్లదొరల వద్ద కొత్త నోట్లు చేరుతున్నాయని, అంతకంటే పెద్ద మార్పేం లేదని కుండబద్దలు కొట్టారు.
     
మీకు నిజంగా తెలుసినదానికి, తెలుసు అని అనుకుంటున్నానికి భారీ అంతరం ఉంటే.. దాని ఫలితం పరమ భయంకరంగా ఉంటుందన్న నసీమ్ నికొలస్ తాలెబ్ రిచంచిన పుస్తకంలో వ్యాఖ్యలు ప్రస్తావించారు. జనం కష్టాలకు ఆర్బీఐ స్వాతిశయమే కారణమని మండిపడ్డారు పవన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు