అనుకున్నది సాధించిన ట్రంప్

అనుకున్నది సాధించిన ట్రంప్

డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా అమెరికా అధ్యుడైపోయినట్లే. కాకపోతే ప్రకటన మాత్రం జనవరి 6న వస్తుందనుకోండి. కీలకమైన ఎలక్టోరల్ కాలేజ్ ఓటింగ్ లో కూడా ట్రంపే ఆధిక్యత సాధించారు. ట్రంప్ కు ఓటేయొద్దని వెల్లువెత్తిన ఈమెయిల్స్, ఫోన్లతో ఎన్నిక ఉత్కంఠభరితంగా జరిగినా.. సంచలనాలు మాత్రం నమోదు కాలేదు.
          
ఎలక్టోరల్ కాలేజీ ఓటింగ్ తో యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికల్లో అసలు ఘట్టం పూర్తైంది. రిపబ్లికన్ ఎలక్టర్లంతా ఎలాంటి ప్రలోభాలకు లోనుకాకుండా ట్రంప్ కే ఓటేశారని.. ఆయన బృందం ప్రకటించింది. ట్రంప్ ను అధ్యక్షుడు కాకుండా అడ్డుకోవడానికి ఆయన ప్రత్యర్థులు ఎంత ప్రయత్నించినా లాభం లేకపోయింది.
       
అమెరికా చరిత్రలోనే ఓ అధ్యక్ష అభ్యర్థిపై ఈ స్థాయిలో వ్యతిరేకత వ్యక్తం కావడం ఇదే ప్రథమం. ఎన్నికల ప్రచారం నుంచి ఇప్పటివరకూ అన్ని అవరోధాల్ని గెలుపు సోపానాలుగా మార్చుకున్న ట్రంప్.. అధ్యక్షుడయ్యాక ప్రతికూలతల్ని కూడా సానుకూలతలుగా చేసి దేశాన్ని ముందుకు నడిపిస్తారని అమెరికన్లు భావిస్తున్నారు.
          
ఇక తన విజయం ఖాయమవడంతో.. ట్రంప్ మరింత దూకుడుగా ప్రణాళికలు రచిస్తారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పటికే జెట్ స్పీడ్ లో పాలసీలకు రూపకల్పన చేస్తున్న ట్రంప్.. తన భావాలకు అనుగుణంగా టీమ్ ను ఎంపిక చేసుకుంటున్నారు. ఫస్ట్ అమెరికా.. నెక్స్ కూడా అమెరికానే అనే నినాదంతో ట్రంప్ దూసుకుపోతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు