నో సీబీఐ.. ఓన్లీ పోలీస్..

నో సీబీఐ.. ఓన్లీ పోలీస్..

సింహా సినిమాలో నో పోలీస్ డైలాగ్ గుర్తుందా. ఇప్పుడు దాదాపుగా అదే డైలాగ్ ను తెలంగాణ సీఎం కేసీఆర్ కాస్త మార్చి చెబుతున్నారు. నో సీబీఐ ఓన్లీ పోలీస్ అంటున్నారు. తెలంగాణ అసెంబ్లీలో నయీంపై జరిగిన చర్చలో కేసీఆర్ సీరియస్ డైలాగ్స్ పేల్చారు. తెలంగాణ పోలీసులు సమర్థంగా పనిచేస్తున్నారని కితాబిచ్చారు.
       
నయీం కేసును సీబీఐకి అప్పగించాలన్న ప్రతిపక్షాల డిమాండ్ పై కేసీఆర్ ఫైరయ్యారు. సీబీఐ వచ్చి ఏం చేస్తుందని ప్రశ్నించారు. నయీం అనుపానులన్నీ మన పోలీసులకు తెలుసన్న కేసీఆర్.. ఎన్ కౌంటర్ చేసింది తెలంగాణ పోలీసులే అన్న విషయం గుర్తించాలని హితవు పలికారు.
         
మన పోలీసులకు జాతీయ స్థాయిలో పేరుందని, అలాంటిది వారిని కాదని సీబీఐకి అప్పగిస్తే.. పోలీస్ శాఖను అవమానించినట్లేనన్నారు. కేసీఆర్. పైగా నయీం కేసు రాష్ట్రస్థాయిదేనని, అందులో జాతీయ కోణమేమీ లేదని గుర్తుచేశారు. కేసీఆర్.
     
నయీం ఆస్తులన్నీ స్వాధీనం చేసుకున్నామని, అనుచరులందర్నీ ఆరెస్ట్ చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. నకిలీ నయీంలు తలెత్తాలని చూస్తే.. తోక కట్ చేస్తామన్నారు కేసీఆర్. తాము అధికారంలోకి వచ్చాక నేరాలు బాగా తగ్గాయని, నయీంని పెంచి పోషించింది గత ప్రభుత్వాలేనని విరుచుకుపడ్డారు కేసీఆర్

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు