వైట్ హౌస్ లో ఇండియాకు బెస్ట్ ఫ్రెండ్

వైట్ హౌస్ లో ఇండియాకు బెస్ట్ ఫ్రెండ్

అమెరికా నూతన అధ్యక్షుడిగా ఎన్నికైన ట్రంప్.. దేశవ్యాప్తంగా పర్యటించి తనను గెలిపించిన ఓటర్లకు కృతజ్ఞతలు చెబుతున్నారు. ఇతే తరహాలో వాషింగ్టన్ లో ర్యాలీ నిర్వహించిన ట్రంప్.. ఎన్నారైలకు ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పారు. భారతీయ అమెరికన్లే తన విజయంలో కీలకమన్నారు.

ఓర్లాండో, ఫ్లోరిడాలో కూడా ఎన్నారైలకు థాంక్స్ చెప్పారు. భారత్ కు చెందిన హిందువులు తన గెలుపు కోసం పాటుపడ్డారని కితాబిచ్చారు. వైట్ హౌస్ లో ఇండియాకు బెస్ట్ ఫ్రెండ్ గా ఉంటానని హామీ ఇచ్చిన ట్రంప్.. మరోసారి మోడీపై ప్రశంసల జల్లు కురిపించారు.

కశ్మీర్, బంగ్లాదేశ్ ఉగ్రదాడుల్లో హిందూ బాధితుల కోసం విరాళాల సేకరణకు ఎన్నికలకు రెండు వారాల ముందు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రంప్ పాల్గొనడంతో.. ట్రంప్ ఎన్నారైలకు దగ్గరయ్యారు. ఆ తర్వాత ట్రంప్ కుటుంబసబ్యులు కూడా రెండు చోట్ల హిందూ ఆలయాలకు వెళ్లి కొత్త సంప్రదాయానికి తెరతీశారు.

మోడీతో కలయిక కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్న ట్రంప్.. ఆయన ఆర్థిక సంస్కరణల్ని కొనియాడారు. మోడీకి మంచి దార్శనికత ఉందని, గొప్ప నేత అని కితాబిచ్చారు. ప్రచారంలో కూడా మోడీ స్టైల్ ను కాపీ కొట్టిన ట్రంప్.. అబ్ కీ బార్ ట్రంప్ సర్కార్ అంటూ రూపొందించిన నినాదం కూడా విజయం సాధించి పెట్టిందని విశ్లేషకుల అంచనా.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు