వీసా లేకుండానే భారత్ కు వచ్చేసిన ఉబెర్ సీఈవో

వీసా లేకుండానే భారత్ కు వచ్చేసిన ఉబెర్ సీఈవో

వీసా లేకుండా ఒక దేశానికి వెళ్లటం సాధ్యమయ్యే పనేనా? సాధ్యం కాదనే చెబుతాం. మన షారూక్ ఖాన్.. అమీర్ ఖాన్.. అంతదాకా ఎందుకు దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం లాంటోళ్లు అన్నీ పత్రాల్ని పెట్టుకొని అమెరికాకు వెళితే.. ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయో తెలిసిందే. కానీ.. వీసా లేకుండా భారత్ కు వచ్చేసిన ఉబెర్ సీఈవోకు ఎలాంటి అనుభవం ఎదురైందన్నది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే.

కారణం ఏదైనా కానీ.. వీసా లేకుండా భారత్ కి వచ్చిన ఆయన.. పొద్దుపొద్దున్నే చేసిన ఫోన్ కాల్ తో వ్యవస్థలు పని చేయటమే కాదు.. ఆయన్ను వెనక్కి వెళ్లకుండా ఎయిర్ పోర్ట్ నుంచి బయటకు వచ్చేలా చేశాయి. వీసా లేకుండా వచ్చిన ఆయన్ను ఎవరు అనుమతించారు? వీసా లేకుండా వచ్చానని తెలుసుకున్న ఆయన.. ఎవరికి ఫోన్ చేశారన్నది చూస్తే..

జనవరి 16న స్టార్టప్ ఇండియా కార్యక్రమంలో ఉబెర్ సహ వ్యవస్థాపకుడు.. సీఈవో ట్రావిస్ కలానిక్ వీసా లేకుండా ఇండియాకు వచ్చేశారు. తన వీసాలో ఉన్న తేదీల విషయంలో కాసింత కన్ఫ్యూజన్ కు గురైన ఆయన.. షెడ్యూల్ కంటే ముందే ఇండియాకు వచ్చేశారు. ఇమ్మిగ్రేషన్ దగ్గర ఆయనకు వీసా లేదన్న విషయాన్ని అధికారులు గుర్తించి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెల్లవారుజామున తనకు ఎదురైన ఈ సమస్యతో ఆయన వెంటనే నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్ కాంత్ కు ఫోన్ చేసి జరిగింది చెప్పారు.

వెంటనే.. ఆయన ఐబీ డైరెక్టర్.. హోం శాఖ కార్యదర్శులను నిద్ర లేపి.. ఇష్యూ సెట్ చేయాలని కోరటం.. వ్యవస్థలు అప్పటికప్పుడు మేల్కొని.. ఇండియాకు వచ్చిన ఉబెర్ సీఈవోకు ఇబ్బంది లేకుండా పని పూర్తి చేసి.. ఆయనకు వీసా ఇష్యూ చేసి ఎయిర్ పోర్ట్ బయటకు పంపారు. వీసా లేకుండా వచ్చిన ఒక బిజినెస్ మెన్ కోసం వ్యవస్థలు నిద్ర లేచి పని చేయటం గమనార్హం.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు