కూలీ ఖాతాలోకి కోటి రూపాయలు ఊడిపడ్డాయి

కూలీ ఖాతాలోకి కోటి రూపాయలు ఊడిపడ్డాయి

దేశంలో జనాలందరూ డబ్బుల్లేక చస్తుంటే.. ఓ కూలీ ఖాతాలోకి ఏకంగా కోటి రూపాయలు ఊడిపడ్డాయి. అదేండి ఊడిపడటానికి అవేమన్నా ఆకాశం నుంచి వచ్చాయా. దాదాపుగా అంతే ఎందుకంటే కూలీ పదివేలు డిపాజిట్ చేస్తే.. బ్యాంకు సిబ్బంది ఉదారతతో అది కాస్తా కోటి పదివేలైంది.
      
మధ్యప్రదేశ్ కు చెందిన విశ్వకర్మ అనే కూలీకి బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఖాతా ఉంది. నోట్లు రద్దవగానే.. తన వద్ద ఉన్న పదివేలు తీసుకెళ్లి బ్యాంకులో వేశారు. అప్పుడు 500 నోట్లు 20 డిపాజిట్ చేశాడు. కానీ బ్యాంక్ సిబ్బంది మాత్రం పొరపాటు న20వేల 500 నోట్లు డిపాజిట్ చేసినట్లు రికార్డులు రాశారు.
      
అంతే తిరిగి చూసుకుంటే కోటి పదివేల రూపాయలు ఖాతాలోకి వచ్చాయి. విశ్వకర్మకు ఐటీ శాఖ నోటీస్ పంపించింది. నోటీస్ ఇంగ్లీష్ లో ఉండటంతో.. అర్థం కాని విశ్వకర్మ.. స్థానిక టీచర్ ను అడిగి విషయం తెలుసుకుని ఆశ్చర్యపోయాడు. బ్యాంక్ కు వెళ్తే అసలు విషయం వెలుగులోకి వచ్చింది.
      
బ్యాంకు సిబ్బంది పొరపాటు వల్లే కోటి రూపాయలు జమైందని మేనేజర్ వివరణ ఇవ్వడంతో.. విశ్వకర్మ ఊపిరి పీల్చుకున్నాడు. అయితే ఈ వ్యవహారాన్ని ఐటీశాఖ అనుమానంగానే చూస్తోంది. అమాయకులైన కూలీల ఖాతాల్ని అడ్డం పెట్టుకుని బ్యాంకర్లు బ్లాక్ ను వైట్ చేస్తున్నారని కూపీ లాగుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు