మళ్లీ టీడీపీలోకి నాగం?

మళ్లీ టీడీపీలోకి నాగం?

తెలంగాణ రాజకీయాలు రెడ్ల ఏకీకరణ దిశగా సాగుతున్నట్లుగా తెలుస్తోంది. అందుకు టీడీపీ వేదిక కానుందని... రేవంత్ రెడ్డి దానికి సారథి కానున్నారని తెలుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలవాలంటే సామాజికవర్గ బలం అవసరమని రేవంత్ రెడ్డి కొన్నాళ్లుగా అంటున్నట్లు తెలియవస్తోంది. అందులో భాగంగానే అన్ని పార్టీల్లోనూ ముఖ్యమైన రెడ్డి నేతలతో ఆయన టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. తాజాగా బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి కూడా రేవంత్ ఆలోచనకు మద్దతు పలుకుతున్నట్లు చెబుతున్నారు. ఆయన మళ్లీ టీడీపీలోకి వచ్చే అవకాశం కూడా ఉందంటున్నారు.

బీజేపీ సీనియర్‌ నేత మాజీ మంత్రి నాగం జనార్థన్‌రెడ్డి శుక్రవారంనాడు అసెంబ్లీలోని    టీడీఎల్పీ కార్యాలయానికి వెళ్లి టీడీపీ కార్యనిర్వహక అద్యక్షుడు రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యతో పాటు మరికొంతమంది నేతలతో నాగం మంతనాలు జరపడం చర్చనీయాంశమైంది. టీడీపీలో ఎదురులేని నాయకుడిగా ఎదిగిన నాగం జనార్థన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ సందర్భంగా ఆ పార్టీ నుంచి బీజేపీలోకి వెళ్లిన విషయం తెలిసిందే!. అయితే రాజకీయాలపై పూర్తి అవగాహన, వ్యూహాన్ని రచిస్తూ ముందుకు వెళ్లే నాగంకు బీజేపీలో తదినంత గౌరవం దక్కడం లేదు. దీంతో ఆయన తిరిగి టీడీపీ గూటికి వెళ్లేందుకే మంతనాలు జరిపారని అంటున్నారు.
   
టీడీపీని వ్యతిరేకించి బీజేపీలో చేరిన నాగం సుధీర్ఘ కాలం తర్వాత తెలంగాణ తెలుగుదేశం లెజిస్లేచర్‌ పార్టీ కార్యాలయంలోకి రావడం, అక్కడ పార్టీ నేతలతో కొద్ది సేపు రహస్యంగా చర్చలు జరపడం అసెంబ్లీ లాబీల్లో పెద్ద చర్చనీయ అంశంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు