అమెరికాలో ఆఖరి పంచ్

అమెరికాలో ఆఖరి పంచ్

అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఎప్పుడో పూర్తయ్యాయి. కానీ అసలు ఎన్నిక మాత్రం ఇంకా ఉంది. అదేంటి అంటారా. అదంతే. మొన్న జరిగిన ఎన్నికలు అధ్యక్షుడ్ని నేరుగా ఎన్నుకున్నవి కాదు. అధ్యక్షుడ్ని బలపరిచే అభ్యర్థుల్ని ఎన్నుకున్నవి. అంటే ఎలక్టోరల్ కాలేజ్ ఎన్నిక జరిగిందన్నమాట.
           
ఇప్పుడీ ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులంతా కలిసి తమ తమ రాష్ట్రాల రాజధానుల్లో సమావేశమై.. అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకుంటారు. రిపబ్లికన్, డెమోక్రటిక్ ఎలక్టర్లు ఎవరికి నచ్చిన అభ్యర్థికి వారు ఓటేసుకోవచ్చు. సాధారణంగా అయితే ట్రంప్ దే మెజారిటీ. కానీ చివరి నిమిషంలో ఏదైనా అద్భుతం జరుగుతుందని కొందరు ఆశపడుతున్నారు.
                
ఈ నెల 19న అమెరికాలో అన్ని రాష్ట్రాల రాజధానుల్లో ఎలక్టర్లు సమావేశమై ఓటు వేస్తారు. ఆ ఓట్లు జనవరి 6న లెక్కించి లాంఛనంగా అధ్యక్షుడ్ని ప్రకటిస్తారు. అదీ అక్కడ సంప్రదాయం. అధ్యక్ష అభ్యర్థిగా రంగంలోకి దిగినప్పట్నుంచీ సంచలనాలకు తెరతీస్తున్న ట్రంప్. ఇప్పుడు కూడా హాట్ టాపిక్ అవుతున్నారు.
         
రెండు వారాల క్రితం టెక్సాస్ రిపబ్లికన్ ఎలక్టర్ క్రిస్టఫర్ ట్రంప్ కు ఓటేయనని ప్రకటించడం కలకలం రెపింది. ట్రంప్ కు ఓటేయమని, ఏకాభిప్రాయంతో మరో అభ్యర్థిని ఎంపిక చేస్తామని రెండు ప్రధాన పార్టీల ఎలక్టర్లు ప్రకటించడం దుమారం రేపుతోంది. అయితే కొంతమంది ట్రంప్ ను వ్యతిరేకించినా ఏమీ కాదని, ఆయనే అధ్యక్షుడౌతారని అమెరికన్లు బలంగా నమ్ముతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు