అనుకున్నది ఒకటి, అయిందొక్కటి - బాబు

అనుకున్నది ఒకటి, అయిందొక్కటి - బాబు

ఏపీ సీఎం చంద్రబాబు ఇంటికే పంపిస్తానంటున్నారు. ఎవర్ని ఇంటికి పంపిస్తారు. ఎందుకు ఇంటికి పంపిస్తారు అని కంగారుపడకండి. బాబు ఎవరికీ వార్నింగ్ ఇవ్వడం లేదు. పెన్షనర్లు క్యూలైన్లో ఇబ్బందిపడటం చూసి.. ఇకపై పెన్షన్ ఇంటికే పంపుతానంటున్నారు అంతే.
          
వృద్ధులకు పెన్షన్లు బ్యాంకులో వేస్తే మంచి జరుగుతుందని భావించామని, కానీ బ్యాంకర్లు పెడుతున్న ఇబ్బందులు తమ దృష్టికి వచ్చాయన్నారు బాబు. క్యూలో నుంచున్న వృద్ధుల్ని చూస్తుంటే బాథేస్తోందని. తాను అనుకున్నది ఒకటి, అయిందొక్కటి అన్నారు బాబు.
      
వచ్చే నెల ఐదు నుంచి ఇంటికే పెన్షన్ వస్తుందని, వృద్ధులంతా ఇకపై ఎలాంటి కష్టాలు పడక్కర్లేదని బాబు భరోసా ఇచ్చారు. పెద్దనోట్ల రద్దుతో తీవ్ర కష్టాలొచ్చాయని, ముఖ్యంగా పింఛన్లకు చిల్లర కష్టం వచ్చిందన్నారు. నగదు పంపిణీలో రైతులు, కూలీలు, పెన్షనర్లకు ప్రాధాన్యమిస్తామన్నారు.
        
ఆర్బీఐ నుంచి మరో విడత 2500కోట్ల డబ్బులొస్తున్నాయని, వాటిని సక్రమంగా పంపిణీ చేయాలని బ్యాంకులకు సూచించారు. పోస్టాఫీసుల్లో చిన్న నోట్లు అందుబాటులో ఉంచాలన్నారు. డిమాండ్ ఉన్న చోటకి మొబైల్ ఏటీఎంలు పంపి రద్దీ తగ్గించాలని సూచించారు బాబు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు