టామ్ అండ్ జెర్రీ గేమ్

టామ్ అండ్ జెర్రీ గేమ్

రెండు అగ్రరాజ్యాలు మళ్లీ ఆట మొదలెట్టాయి. ఎప్పుడో ముగిసిన ప్రచ్ఛన్న యుద్ధాన్ని గుర్తుచేస్తూ.. మొన్నటివరకూ సిరియాతో పరోక్షంగా యుద్ధం చేసిన అమెరికా, రష్యా.. ఇప్పుడు కొత్త తరహాలో వార్ కు తెరతీశాయి. యూఎస్ అధ్యక్ష ఎన్నికల్లో రష్యా జోక్యంపై ఇంటా, బయటా దుమారం రేగుతోంది.
   
అమెరికా అధ్యక్షుడికా ట్రంప్ ఎన్నికకు రష్యా సహకరించింది. హిల్లరీ ఈమెయిల్స్ హ్యాకింగ్ పుతిన్ పనే. ఇదీ డెమోక్రాట్ల వాదన. కానీ దీన్ని ట్రంప్ కొట్టిపారేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ పుతిన్ ను పొగడటం, పుతిన్ కూడా ట్రంప్ తో భేటీకి ఆసక్తి చూపించడంతో.. వివాదం రేగుతూనే ఉంది.
       
ఇప్పుడు తాజాగా యూఎస్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఎన్నికల సమయంలో రష్యా పాత్ర నిజమేనని నిర్థారించారు. హిల్లరీ ఈమెయల్స్ హ్యాకింగ్ రష్యా నుంచే జరిగిందని ధృవీకరించారు. దీంతో దుమారం మళ్లీ మొదలైంది. హిల్లరీని కుట్రపూరితంగా ఓడించారని, అమెరికా అంతర్గత వ్యవహారాల్లో పుతిన్ జోక్యం చేసుకున్నారని ఒబామా ఫైరైపోతున్నారు.
      
రష్యాకు తగిన శాస్తి చేస్తామంటున్నారు ఒబామా. ముందే తెలిస్తే ఎందుకు చెప్పలేదని ట్రంప్ నిలదీస్తున్నారు. కానీ రష్యా హ్యాక్ చేయడానికి కారణముందంటున్నారు పరిశీలకులు. అదే హిల్లరీపై పాత పగ. హిల్లరీ విదేశాంగమంత్రిగా రష్యా ఎన్నికల విషయంలో గందరగోళానికి కారణమయ్యారు. అందుకే పుతిన్ ఇలా పగతీర్చుకున్నారని పుకార్లు వస్తున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు