కేసీఆర్ తానా అంటే ఆయన తందానా

కేసీఆర్ తానా అంటే ఆయన తందానా

కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి. ఏ పార్టీలో ఉన్నారు. అదేంటి అలా అడుగుతారు . ఆయన కాంగ్రెస్ సీనియర్ నేత కదా అంటారా. అవును నిజమే. కానీ టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చినదగ్గర్నుంచీ జానారెడ్డి వైఖరి మారిపోయింది. కేసీఆర్ తానా అంటే ఆయన తందానా అంటున్నారు.
    
అసెంబ్లీలో జానా దెబ్బకు కాంగ్రెస్ కు వాయిస్ లేకుండా అయిపోయింది. తాను తిట్టరు, పక్కవాళ్లను తిట్టనివ్వరు అన్నట్లుగా జానా ప్రవర్తిస్తున్నారు. ఎప్పుడైనా పొరపాటున ప్రభుత్వాన్ని విమర్శించాల్సిస్తే.. నాలుగు జోకులు చెప్పి.. జోకర్లా మిగిలిపోతున్నారు జానారెడ్డి.
      
జానారెడ్డి తీరుపై కేంద్రానికి ఎన్నో ఫిర్యాదులు వెళ్లాయి. అయినా సరై జానా తీరు మారలేదు. నోట్ల రద్దుపై సభలో జరిగిన చర్చలో జానా తీరు చూసి.. కాంగ్రెస్ నేతలంతా తలపట్టుకుంటున్నారు. జానారెడ్డి ఎవర్ని తిట్టారో, ఎవర్ని పొగిడారో తెలియక బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారు.
         
ఓవైపు టీడీపీ, ఎంఐఎం, చివరకు ఒక సభ్యుడైన సీపీఎం కూడా నోట్ల రద్దుపై గట్టిగా మాట్లాడాయి. సీఎంని నిలదీశాయి. కానీ ప్రధాన ప్రతిపక్ష నేత జానారెడ్డి మాత్రం సున్నితంగా కర్ర విరక్కుండా పాము చావకుండా మాట్లాడారు. పైగా సీఎం అంతర్గతంగా బాథపడుతున్నారని సానుభూతి ఒలకబోయడం హస్తం నేతలకు షాకిచ్చింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English