మీలో కొందరే కోటీశ్వరులు

మీలో కొందరే కోటీశ్వరులు

అదేంటీ మాటీవీ టెలివిజన్ షో గురించి చెబుతున్నారనుకుంటున్నారా. కాదండీ ఇది టీవీ షో కాదు. సెంట్రల్ గవర్నమెంట్ షో. డిజిటల్ ట్రాన్సాక్షన్స్ ను ప్రోత్సహించడానికి లాటరీ తరహా స్కీమ్ ప్రకటించింది మోడీ సర్కారు. మెగా ప్రైజ్ గా కోటి రూపాయలు అనౌన్స్ చేసింది.
        
కళ్లు చెదిరే మొత్తం దక్కాలంటే తప్పకుండా డిజిటల్ లావాదేవీలే జరపాలి. లక్కీ గ్రాహక్ యోజన పేరుతో వ్యక్తిగత వినియోగదారులకు, డిజి వ్యాపారి ధన్ యోజన  పేరుతో వ్యాపారుల కోసం రెండు స్కీములు నీతి అయోగ్ ప్రకటించింది. ఈ నెల 25న క్రిస్మస్ తో మొదలయ్యే లక్కీ డ్రాలు.. ఏప్రిల్ 14న అంబేద్కర్ జయంతి వరకు కొనసాగుతాయి.
        
ఈ రెండు స్కీమ్ ల కింద 340కోట్ల రూపాయల నగదు బహుమతి ఇస్తారు. అయితే ఈ రెండు స్కీమ్ లు ఏప్రిల్ 14 తర్వాత కొనసాగించాలా.. వద్దా అనేది ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది. రూపే కార్డులు, యూపీఐ, ఎస్ఎస్ఎస్డీ, ఆధార్ ఆధారిత చెల్లింపులకే ఈ స్కీములు వర్తిస్తాయి.
      
ఎక్కువ మంది డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసే వీసా, మాస్టర్ కార్డులు, స్వైపింగ్ మెషీన్లు, ప్రైవేట్ కంపెనీల వ్యాలెట్ల కు స్కీములు వర్తించవని ప్రభుత్వం చెప్పడం చాలా మందిని నిరాశకు గురిచేసింది. అసలు ప్రభుత్వం చెప్పిన యూపీఐ, ఎస్ఎస్ఎస్డీ , ఆధార్ ఆధారిత సేవలేంటో డిజిటల్ ట్రాన్సాక్షన్స్ చేసేవాళ్లకూ తెలీదంటే అతిశయోక్తి కాదు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు