ఉపగ్రహ అనుగ్రహంతోనే ప్రాణాలు దక్కాయి

ఉపగ్రహ అనుగ్రహంతోనే ప్రాణాలు దక్కాయి

మనకు చిన్న చిన్న అడ్డంకులు కలిగించే వాళ్లను ఉపగ్రహాలతో పోల్చడం ఆనవాయితీ. కానీ ఇప్పుడదే ఉపగ్రహాలు మన ప్రాణాలు కాపాడుతున్నాయి. అంతరిక్ష రంగంలో భారత్ విజయపతాక ఎగరేస్తున్న ఇస్రో.. ఇప్పుడు ప్రకృతి విపత్తుల సమయంలో ప్రాణనష్టాన్ని నివారిస్తోంది.
       
ఇస్రో ప్రయోగించిన రెండు శాటిలైట్లు.. వార్థా తుపాను తీవ్రత అంచనాకు సాయపడ్డాయి. అవి పంపించిన ఇమేజ్ ల సాయంతోనే వాతావరణ కేంద్రం తుపాను గమనాన్ని విశ్లేషించి రెండు రాష్ట్ర ప్రభుత్వాలను ముందుగా అప్రమత్తం చేసింది. దీంతో పెద్ద ముప్పు తప్పింది.
      
తమిళనాడులో చెన్నైతో పాటు తిరువళ్లూరు, కాంచీపురం జిల్లాలకు తుపాను ముప్పుంది. దీంతో వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు మొత్తం పదివేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తర్వాత తుపాను రావడం.. భారీగా ఆస్తినష్టం జరగడం అంతా అయిపోయింది. కానీ విలువైన ప్రాణాలు దక్కాయి.
        
శాటిలైట్లు పంపించిన హై రిజల్యూషన్ ఇమేజెస్ సాయంతో అధికారులు ముందస్తు హెచ్చరికలు జారీ చేయగలిగారు. దీంతో పదివేల మంది ప్రజలు ప్రాణాలు దక్కించుకున్నారు. గత కొంతకాలంగా ప్రకృతి విపత్తుల్లో దేశంలో ప్రాణనష్టం తక్కువగానే ఉంది. ఇక ఆస్తినష్టాన్ని కూడా నివారించే ఉపాయాలు కనుగొనాల్సి ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English