ఈ విషయంలోనూ గ్లోబల్ లీడర్ మోడీనే

ఈ విషయంలోనూ గ్లోబల్ లీడర్ మోడీనే

పెద్ద నోట్ల రద్దు. నెల రోజులుగా ఈ అంశంపైనే దేశ, విదేశాల్లో చర్చ జరుగుతోంది. రాత్రికి రాత్రి తమ దగ్గరున్న నోట్లు చిత్తుకాగితాలుగా మారడంతో కోట్ల మంది జనం రోడ్ల మీదకు వచ్చారు. అటు ప్రపంచవ్యాప్తంగా ఈ నిర్ణయంపై ఆశ్చర్యం వ్యక్తమైంది. కానీ ఇదే సరైన నిర్ణయమని కొన్ని దేశాలు బావిస్తున్నాయి.
      
భారత్ అనుభవాన్ని కళ్లారా చూసిన తర్వాత వెనిజులా పెద్ద నోటు రద్దు చేసింది. సరే వెనిజులా అంటే లెఫ్టిస్ట్ కంట్రీ కాబట్టి సరే అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఫక్తు కార్పొరేట్ కంట్రీగా పేరున్న ఆస్ట్రేలియా కూడా పెద్దనోటు రద్దు గురించి ఆలోచిస్తోంది. వచ్చే సోమవారం ప్రకటన వెలువడుతుందని భావిస్తున్నారు.
       
ఆస్త్రేలియా నిజంగానే వంద డాలర్ల నోటు రద్దు చేస్తే.. ఆ ఎఫెక్ట్ అమెరికా, ఇంగ్లండ్ పై పడటం ఖాయం. బ్లాక్ మనీ తగ్గింపుకు పెద్ద నోట్ల రద్దే మందన్న భారత్ వాదనకు అన్ని దేశాలు మద్దతిస్తున్నట్లే భావించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆసీస్ తో ఎక్కువగా యూఎస్, అమెరికాతోనే వాణిజ్య సంబంధాలున్నాయి.
      
పెద్దనోట్ల రద్దుతో దేశంలో విమర్శలు ఎదుర్కుంటున్న మోడీకి.. అంతర్జాతీయ వేదికలపై మాత్రం సపోర్ట్ దొరుకుతోంది. నిజంగానే మోడీ చెప్పినట్లు పెద్ద నోట్ల రద్దుతో బ్లాక్ మనీ లెస్ ఇండియా సాకారమైతే.. మోడీ ఇమేజ్ మరింత పెరగడం ఖాయంగా కనిపిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు