ఇంకా ఆరు నెలలు ఇంతే..

ఇంకా ఆరు నెలలు ఇంతే..

నెల రోజులుకే జనం అల్లాడుతున్నారు. 50రోజులంటేనే వామ్మో అనుకుంటున్నారు. అలాంటిది ఒకటి కాదు. రెండు కాదు.. 180 రోజులంటే ఇంకేం జరుగుతుందో. కానీ భరించాలి తప్పదంటున్నారు నిపుణులు. చలామణీలో ఉన్న 86 శాతం కరెన్సీ రద్దైతే.. ఆ నోట్లన్నీ యాభై రోజుల్లో మళ్లీ ప్రింట్ చేయడం అసాధ్యమేనట.
        
అంటే 50రోజుల్లో అంతా సరౌతుందన్న మోడీ మాటలు అబద్ధాలా. నిపుణుల మాటలు వింటే నిజమేననిపిస్తోంది. పెద్ద నోట్ల రద్దుతో మొత్తం 86 శాతం కరెన్సీ రద్దైపోయింది. వాటిలో 9 శాతం ప్రింట్ చేయాలన్నా.. 2017 మే వరకూ టైమ్ పడుతుంది. అదే మొత్తం నోట్లు మళ్లీ రావాలంటే.. ఆగస్ట్ రావాల్సిందే.
       
మన ప్రింటింగ్ ప్రెస్ ల నంబర్, సామర్థ్యం అంచనా వేసి నిపుణులు చెబుతున్న మాటలివి. నాలుగే ప్రింటింగ్ ప్రెస్ లు ఉన్నాయి. అవి సంవత్సరానికి 2670 కోట్ల నోట్లు ప్రిట్ చేయగలవు. రోజుకు 7.4 కోట్లు కెపాసిటీ. గతంలో రెండు షిఫ్టులు పనిచేసిన ప్రెస్ లు.. ఇప్పుడు మూడు షిప్ట్ లు పనిచేస్తున్నాయి.
       
ప్రెస్ ల్లో ఉద్యోగులు ఎంత విరగబడ్డా.. రోజూ 11.1 కోట్లు ప్రింట్ చేయగలవు. ఎక్కువ సెక్యూరిటీ పీచర్లు కలిగిన 500నోట్ల ప్రింటింగ్ ఇంకా లేట్ పడుతుంది. ఈ నోట్ల ప్రింటింగ్ రోజుకు 5.56 కోట్లు మాత్రమే సాధ్యం. ఇలాంటప్పుడు మరో మూడు వారాల్లో అంతా నార్మల్ కాదనేది నిపుణుల మాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు