జయ వీలునామా ఎప్పుడో రాశారా..?

జయ వీలునామా ఎప్పుడో రాశారా..?

బతికినంత కాలం రాణిలా బతికిన జయ.. బంధువులెవ్వర్నీ దగ్గరకు రానివ్వలేదు. జనం కోసమే బతికిన జయ. .హీరోయిన్ గా ఉన్న రోజుల్లో బాగా ఆస్తులు కూడబెట్టారు. మరి జయ మరణం తర్వాత అవన్నీ ఎవరి పరమౌతాయి. ఈ ప్రశ్నలకు ఇప్పుడు సమాధానం దొరికిది. అదే జయ వీలునామా.

ఏంటీ జయ వీలునామా రాశారా. ఎప్పుడు, ఎక్కడ. అవును జయ వీలునామా రాశారు. అదీ ఇప్పుడు కాదు 16 ఏళ్ల క్రితమే. తన ఆస్తులన్నీ రక్తసంబంధీకురాలి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. మరో రెండు ట్రస్టులకు ఆస్తులు పంచారు. ఇదంతా హైదరాబాద్ జేజే గార్డెన్ పేరుతో రిజిస్ట్రేషన్ కూడా చేయించారు.

కానీ జయ ఎవరి పేరుతో ఆస్తి రాశారనేది మాత్రం టాప్ సీక్రెట్. ఇది సదరు వ్యక్తికి తప్ప ఇతరులకు చెప్పలేమని అధికారులు చెబుతున్నారు. జయ ఆస్తులపై కన్నేసిన శశికళ కుటుంబానికి ఈ వీలునామా వార్తలతో కంటి మీద కునుకు కరవైంది. లీగల్ హెయిర్ ఎవరో తెలుసుకుందామని ప్రయత్నిస్తున్నా సాధ్యం కావడం లేదు.

ఎందుకంటే తమిళనాడు అధికారులైతే శశికళ మాట వినేవారు. అందుకే జయ తెలివిగా హైదరాబాద్ లో రిజిస్ట్రేషన్ చేశారు. కాబట్టి ఇక్కడ అధికారులు శశికళ మాట వినే అవకాశం లేదు. అందుకే జయ వీలునామా సంగతి రహస్యంగానే ఉంచుతున్నారు. లీగల్ హెయిర్ ఎవరో త్వరలో తెలిసే అవకాశం ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు