కిరణ్ రాజకీయ భవిష్యత్ ఏంటి..?

కిరణ్ రాజకీయ భవిష్యత్ ఏంటి..?

సమైక్యాంధ్ర చివరి సీఎం కిరణ్ కుమార్ రెడ్డిని జనం ఎప్పుడో మర్చిపోయారు. ఆయన కూడా రాజకీయాలు పక్కన పడేశారు. ఏదో పరిచయస్తులు ఇంటికి మాత్రం వెళ్లి అడపాదడపా వేడుకలుక హాజరౌతున్నారు. అలాంటి కిరణ్ మళ్లీ పాలిటిక్స్ లోకి వస్తారని ఎప్పట్నుంచో ఊహాగానాలు వస్తున్నాయి. ఇప్పుడు ఉన్నట్లుండి అవి మళ్లీ గుప్పుమంటున్నాయి.
         
కొద్దిరోజుల క్రితం ఏపీ పీసీసీ చీఫ్ రఘువీరా నెల్లూరు పర్యటనకు వచ్చారు. ఆ సమయంలో సమైక్యాంధ్ర పార్టీలో కీలకంగా పనిచేసిన నేతలు కొందరు కాంగ్రెస్ కండువాలు కప్పుకున్నారు. దీంతో కిరణ్ కూడా కాంగ్రెస్ లోకి వస్తారని ప్రచారం మొదలైంది.
       
అసలు కాంగ్రెస్ లోకి వస్తే ఏ పదవి ఇవ్వాలనే ప్రశ్న తెరపైకి వచ్చింది. కిరణ్ క్యాబినెట్లో రఘువీరా మంత్రిగా పనిచేశారు కాబట్టి.. ఆయన కింద కిరణ్ పనిచేయలేదు. కిరణ్ కు పీసీసీ చీఫ్ కానీ, ఏఐసీసీ పదవి కానీ ఇవ్వాలి. ఇప్పుడున్న సమీకరణాల్లో అది సాధ్యమేనా అనే అనుమానాలున్నాయి.
       
కాంగ్రెస్ తనను కేర్ చేయలేదు కాబట్టి కిరణ్ ఇతర పార్టీలవైపు చూసే అవకాశం ఉంది. బాబు బద్ధశత్రువు కాబట్టి టీడీపీలోకి వెళ్లలేరు. జగన్ పైనే బాగా విమర్శలు చేశారు కాబట్టి వైసీపీలోకి వెళ్లడం కష్టసాధ్యమే. అటు బీజేపీలోకి వెళితే అన్నివిధాలా బాగుంటుందని బావించినా.. కమలం నేతలు పెద్దగా స్పందించడం లేదు. ప్రస్తుతం కిరణ్ పొలిటికల్ క్రాస్ రోడ్స్ లో ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు