కేంద్రం ముష్టి కొనసాగింపు

కేంద్రం ముష్టి కొనసాగింపు

ఇవ్వడం, ఇవ్వకపోవడం అనే సంగతి పక్కనపెడితే... ప్రస్తుతం వారానికి మన ఖాతా నుంచి తీసుకోగలిగే గరిష్ఠ మొత్తం రూ.24 వేలు! అంటే... నెలకు రూ.96 వేలు! దీనిని 50వేలకు కుదించాలని కేంద్రం భావిస్తోంది.  ఈ దిశగా కసరత్తు కూడా మొదలైంది. బ్యాంకుల్లో అంతర్గతంగా దీనిపై అభిప్రాయ సేకరణ కూడా జరుగుతోంది.

పరిమితమైన నగదు లావాదేవీలను ప్రోత్సహించడంలో భాగంగా... ప్రజలకు నగదును ఒక స్థాయి వరకే అందుబాటులో ఉంచాలని కేంద్రం భావిస్తోంది. మరోవైపు... కనీస పరిమితిగా మీరే నిర్ణయించిన రూ.24వేలు కూడా ఎందుకు ఇవ్వడంలేదు అంటూ తెలుగు రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రశ్నించింది.
                    
సామాన్య మధ్య తరగతి నుంచి ఓ మోస్తరు సంపన్న కుటుంబం దాకా... కనీస అవసరాలకు ఒక నెలకు గరిష్ఠంగా నగదు రూపంలోనే ఎంత ఖర్చు పెట్టాల్సి వస్తుంది? గత కొన్నేళ్లుగా సేవింగ్స్‌ ఖాతాల నుంచి విత డ్రాయల్స్‌  సరళి ఎలా ఉంది? తదితర అంశాలపై ప్రస్తుతం జాతీయ స్థాయిలో సమాచార సేకరణ, విశ్లేషణ జరుగుతోంది.
                  
పాలు, కూరగాయలు, చిల్లర సరుకులు, ఇతర చిన్న చిన్న అవసరాలకు నెలకు రూ.50 వేలకు మించి నగదు రూపంలో ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదనే అంచనాకు వస్తున్నారు. రైలు, బస్సు క్యాబ్‌లు, దుకాణాల్లో కొనుగోళ్లు ఇతర పెద్ద మొత్తాలను కార్డులు, చెక్కులు, డీడీలు, ఆన్‌లైన్‌లో జరిపే అవకాశాలున్నందున... నగదు పరిమితిని బాగా కుదించాలని భావిస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు