ఆయనంతే.. అదో టైపు..

ఆయనంతే.. అదో టైపు..

ఏపీ సీఎంఓలో ఆ అధికారి కథే వేరు. స్టయిల్‌కేం తక్కువ లేదు. స్టయిల్‌ కొట్టడం తప్పు కాదు కానీ.. విదేశాల్లోంచి వచ్చే పారిశ్రామికవేత్తలనైనా... సీనియర్‌ ఐఎఎస్‌ అధికారులనైనా ఆయన లెక్క చేయరు! ఇట్టాగే అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు అమెరికా నుంచి వచ్చిన ఓ బడా పారిశ్రామికవేత్త దగ్గరా వేషాలేశారు.
                  
ఆ అధికారి బిహేవియర్‌ ఆ పారిశ్రామికవేత్తకు అసంతృప్తినే మిగిల్చింది.. చంద్రబాబువంటి ముఖ్యమంత్రి కార్యాలయంలో ఇలాంటి అధికారులు కూడా ఉంటారా అని ఆయన ఆశ్చర్యపోయారు కూడా!
                 
ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు పరిపాలనదక్షుడనే పేరుంది..ఆయన కార్యాలయం కూడా అందుకు ధీటుగానే ఉంటుందని అందరూ భావిస్తారు. గతంలో చంద్రబాబు కార్యాలయం నుంచి ఫోన్‌ వచ్చిందంటే చాలు అధికారులకు చెమటలు పట్టేవి. రెండోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎందుకోగాని అధికారులలో చంద్రబాబు అంటే అంత సీరియస్‌నెస్‌ కనిపించడం లేదు..
               
గల్ఫ్‌లో పెద్ద గ్రూపుకు అధిపతి అయిన ఆ పారిశ్రామికవేత్త సీఎం చంద్రబాబు పిలుపుమేరకు అమరావతిలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమయ్యారు.. ఆ ఆసక్తితోనే విజయవాడకు వచ్చారు. సీఎంవో కార్యాలయంలోని ఓ అధికారి ఆయన స్టయిల్‌లోనే ఆ రూమ్‌లోకి ఎంట్రీ ఇచ్చారు..ఆ బడా పారిశ్రామికవేత్తను అనుమానాస్పదంగా చూడటం మొదలెట్టారు.. ఈలోగా పారిశ్రామికవేత్త తనను కలిసేందుకు వచ్చారన్న సమాచారం సీఎంకు అందింది.. వెంటనే సమావేశాన్ని అర్థంతరంగా ముగించుకుని నిమిషాల్లో ముఖ్యమంత్రి అక్కడికి చేరుకున్నారు.  చంద్రబాబు వంటి నాయకుడు పెట్టుబడులు పెట్టాల్సిందిగా అడగడంతో ఆయన మరో మాట లేకుండా నాలుగువేల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తానని అక్కడికక్కడే హామీ ఇచ్చారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు