భారత్ కు లీజియన్ వార్నింగ్

భారత్ కు లీజియన్ వార్నింగ్

మేం తలుచుకుంటే భారత్ లో కల్లోలం రేగుతోంది. ఇదెవరో పాకిస్థానో, ఉగ్రవాదులో చేస్తున్న వార్నింగ్ కాదు. హ్యాకింగ్ గ్రూప్ వార్నింగ్. ప్రముఖుల ఖాతాలను హ్యాక్ చేస్తూ హల్చల్ చేస్తున్న హ్యాకర్లు.. ఇప్పుడు ఏకంగా కేంద్రానికే సవాల్ విసురుతున్నారు.
        
దేశంలో ప్రముఖ ఆస్పత్రుల సర్వర్లను హ్యాక్ చేయడంతో.. మరింత ఆందోళన రేగుతోంది. తమకు 40వేల ఇండియన్ సర్వర్లకు యాక్సిస్ ఉందని హ్యాకర్లు సంచలన ప్రకటన చేశారు. అపోలో ఆస్పత్రి కూడా ఈ లిస్ట్ లో ఉండటంతో..  ఆస్పత్రి వర్గాలు ఆందోళన చెందుతున్నాయి.
             
వాషింగ్టన్ పోస్ట్ కు లీజియన్ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ సంచలన విషయాలు వెల్లడయ్యాయి. దీంతో ఇండియన్ సైబర్ సెక్యూరిటీ సెల్స్ అన్నీ యాక్టివేట్ అయ్యాయి. ఎప్పుడేం జరుగుతుందోనని టెన్షన్ పడుతున్నాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు