మనలాగే..ఆ దేశం కూడా పెద్ద నోట్లు రద్దు చేసింది

మనలాగే..ఆ దేశం కూడా పెద్ద నోట్లు రద్దు చేసింది

ఇండియాలో పెద్ద నోట్లను రద్దు చేసినట్లుగానే లాటిన్ అమెరికా దేశం వెనిజులా కూడా మన బాటపట్టింది. వెనిజులా కూడా అకస్మాత్తుగా వంద బొలివర్ నోటును రద్దు చేసింది. పెద్ద నోటు స్థానంలో నాణాలను ప్రవేశపెట్టనున్నట్లు ఆ దేశాధ్యక్షుడు నికోలస్ మాడురో తెలిపారు. ఈ ప్రక్రియ 72 గంటల్లోనే ముగుస్తుందన్నారు.

100 బొలివర్ నోటును రద్దు చేయడం వల్ల దేశ సరిహద్దుల్లో సాగే స్మగ్లింగ్ను అరికట్టవచ్చు అని మాడురో తెలిపారు. ప్రస్తుతం తమ దేశంలో నెలకొన్న ఆహార కొరత కూడా తీరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. నోట్ల రద్దు విషయంలో తక్కువ సమయం ఇవ్వడం వల్ల స్మగ్లర్ల ఆగడాలను నివారించవచ్చు అని మాడురో స్పష్టం చేశారు.

తక్కువ సమయంలోనే పెద్ద నోటు స్థానంలో నాణాలను తీసుకోవడం కుదరదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో 100 బొలివర్ నోటు విలువ చాలా పడిపోయింది. అమెరికా డాలర్తో పోలిస్తే దాని విలువ రెండు సెంట్లకు పడిపోయింది. వెనిజులాలో ఆర్థిక, రాజకీయ అస్థిరత నెలకొంది. ఆ దేశ ద్రవ్యోల్బణం కూడా దారుణంగా ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు