నోట్లు సరిగా ముద్రించక 200 కోట్ల నష్టం

నోట్లు సరిగా ముద్రించక 200 కోట్ల నష్టం

పెద్ద నోట్ల రద్దు తరువాత కొత్త కరెన్సీని తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే... అందులో 500 నోట్ల ముద్రణలో లోపాల కారణంగా భారీ నష్టమొచ్చింది. సమయానికి ప్రజలకు నగదు అందకపోవడమే కాకుండా ముద్రించిన నోట్లు పనికి రాక కొత్తవి ముద్రించాల్సిన అవసరం ఏర్పడి మరింత నష్టం కలిగింది. దేవాస్, నాసిక్ లలోని ముద్రణ కేంద్రాల్లో కొత్త 500 నోట్లను ముద్రించారు. వాటిలో సుమారు 20 కోట్ల నోట్లు సక్రమంగా లేకపోవడంతో వాటిని చెలామణీలోకి తేకుండా నిలిపివేశారు.

వీటితో పాటు నోట్ల రద్దు నాటికి ప్రింట్ చేసిన పాత 500 నోట్లు మరో 70 కోట్ల నోట్లు ఉన్నాయట. పాతవి రద్దు చేయడంతో అవీ వృథాగా మారాయి. అంటే సుమారు 90 కోట్ల సంఖ్యలో నోట్లు వృథా అయ్యాయి.

కొత్త 2 వేల, 500 నోట్ల ముద్రణకు రూ.10 ఖర్చవుతోందట. అంటే వృథా అయిన కొత్త 500 నోట్ల ముద్రణకు తక్కువ ఖర్చేమీ కాలేదు. మొత్తం 20 కోట్ల నోట్లు వృథా అయ్యాయి. అంటే...  ఒక్కొక్కదానికి 10 రూపాయల లెక్కన కొత్త నోట్లలో 200 కోట్ల నష్టం వచ్చిందన్నమాట.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు