ఒక్క రాత్రి.. 15 టన్నులు

ఒక్క రాత్రి.. 15 టన్నులు

దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ అంతా ఇంతా కాదు. నవంబర్ 8న పెద్ద నోట్ల రద్దు చేశారు. అందరికీ తెలుసు . కానీ అదే రోజు రాత్రి మూడో కంటికి తెలియకుండా బంగారం షాపులు చేసిన బ్లాక్ బిజినెస్ కళ్లు బైర్లు కమ్మేలా ఉంది.

ఒక్కరాత్రిలో 15 టన్నుల బంగారం అమ్ముడైపోయింది. సాధారణంగా నెలలో అమ్ముడుపోయే బంగారంలో ఇది 20 శాతం. కానీ దీనిలో బ్లాక్ బంగారమే ఎక్కువని అధికారులు అనుమానిస్తున్నారు. అందుకే వరుసగా బంగారు షాపులపై దాడులు చేస్తున్నారు.

మొత్తం ఆరు లక్షల బంగారు వ్యాపారుల్లో 1800 మంది నిబంధనలు ఉల్లంఘించారని తేలింది. వీరిపై కఠిన చర్యలకు కేంద్రం రంగం సిద్ధం చేసుకుంది. దీంతో అన్ని బంగారు షాపుల నుంచి ఎకౌంట్స్ లెక్కలు తెప్పిస్తోంది కేంద్రం.

ఈ దెబ్బతో చాలా మంది దుకాణాలు కట్టేసి పరారయ్యారు. ఎక్కువ షాపులు అసలు తెరుచుకోవడం లేదు. మూడు నాలుగు బంగారం షాపుల ఓనర్లు ఇప్పటికే బుక్కయ్యారు. దీంతో మిగతా వాళ్లు కూడా జాగ్రత్తపడుతున్నారు. ఒక్క రాత్రిలో ఇన్ని టన్నుల బంగారం అమ్ముడవడంతో.. కేంద్రం వేయికళ్లతో పరిణామాలు గమనిస్తోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు