ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్ట్

ఓటుకు నోటు కేసులో కొత్త ట్విస్ట్

రెండు తెలుగు రాష్ట్రాల రాజకీయాల్ని ప్రభా వితం చేసిన ఓటుకు నోటు కేసు సరికొత్త మలుపు తిరిగింది. కేసును పొలిటికల్ గా వాడుకుందామనుకున్న నేతలకు హైకోర్టు షాకిచ్చింది. ఫిర్యాదుదారులు, బాధితులు తప్ప ఎవరూ జోక్యం చేసుకోవద్దని వార్నింగ్ ఇచ్చింది.

ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పాత్రపై విచారణ జరపాలని మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి గతంలో ఏసీబీ కోర్టును ఆశ్రయించారు. ఏసీబీ రిపోర్ట్ లో చాలాసార్లు బాబు పేరున్నా ఉద్దేశపూర్వకంగానే దాన్ని విస్మరించి దర్యాప్తు చేశారని ఆరోపించారు.

ఆళ్ల రామకృష్ణారెడ్డి వాదనను ఏసీబీ కోర్టు అంగీకరించింది. బాబు పాత్రపై కూడా విచారణ జరపాలని ఆదేశించింది. అయితే ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఏసీబీ కోర్టు నిర్ణయాన్ని హైకోర్టులో సవాల్ చేశారు. ఆళ్లరామకృష్ణారెడ్డికి వాదనలు వినిపించే హక్కే లేదని వాదించారు.

చంద్రబాబు వాదనకు హైకోర్టు ఓకే చెప్పింది. బాబు పాత్రపై దర్యాప్తు అనవసరం అని తేల్చిచెప్పింది. బాధితులో, ఫిర్యాదుదారులో వాదనలు వినిపించాలి కానీ, ఈ కేసుతో మీకేం సంబంధమని ఆళ్ల రామకృష్ణారెడ్డి లాయర్ ను హైకోర్టు ప్రశ్నించింది. అటు ఉండవల్లి అరుణ్ కుమార్ వాదనను కూడా తోసిపుచ్చింది.