చిన్నమ్మ చేతిలో తమిళనాడు రిమోట్..

చిన్నమ్మ చేతిలో తమిళనాడు రిమోట్..

అప్పుడు అమ్మ.. ఇప్పుడు చిన్నమ్మ.. సీన్ లో పెద్ద తేడా ఏం లేదు. తమిళనాడు ప్రభుత్వ రిమోట్ ఇప్పుడు శశికళ చేతిలోకి వెళ్లిపోయింది. జయ అంత్యక్రియలు ముగిసిన రెండోరోజే సీఎం పన్నీర్ సెల్వం సహా క్యాబినెట్ మొత్తం పోయెస్ గార్డెన్లో శశికళ దర్శనానికి వెళ్లారు.

పార్టీ భవిష్యత్తుపై కీలక చర్చలు జరిగాయని తెలుస్తోంది. పార్టీ సర్వసభ్య సమావేశంతో పాటు పాలనాపరమైన అంశాలపై సమావేశంలో కీలక చర్చ జరిగింది. అమ్మ సంక్షేమ పథకాల కొనసాగింపుతో పాటు అమ్మ మరణంతో మరణించిన వారి కుటుంబాలకు చెక్కుల పంపిణీప కూడా చర్చించారు.

త్వరలోనే పార్టీ పగ్గాలు శశికళ చేతికి రానున్నాయి. దాదాపు వంద మంది ఎమ్మెల్యేలు ఆమెకు మద్దతుగా ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. శశికళ ఆశీర్వాదాలతో పార్టీ టికెట్లు సాధించి గెలిచిన వాళ్లే ఎక్కువగా ఉన్నారు. ముఖ్యంగా శశికళ సామాజికవర్గం దేవర్ ఎమ్మెల్యేలంతా ఆమెకే మద్దతిస్తున్నారు.

మరోవైపు దేవర్ సామాజికవర్గానికి వ్యతిరేకంగా మరో బలమైన సామాజికవర్గం గౌండర్ తెరపైకి వచ్చింది. గౌండర్ కు చెందిన సీనియర్ నేత సెంగొట్టయ్యన్ పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీపడే ఛాన్స్ ఉంది. అదే జరిగితే అన్నాడీఎంకేలో ముసలం తప్పదని అంచనా వేస్తున్నారు. ఇన్ఛార్జ్ గవర్నర్ విద్యాసాగర్రావు కూడా ఢిల్లీ వెళ్లి.. తమిళనాడులో పరిస్థితులపై ఢిల్లీ పెద్దలకు వివరించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు