జయ నగలు ట్రెజరీ పాలు

జయ నగలు ట్రెజరీ పాలు

జయలలిత నివాసంపై 1995లో భారీ సంఖ్యలో ఐటీ అధికారులు దాడి చేశారు. అప్పుడు అందరి కళ్లు బైర్లు కమ్మే సంపద బయటపడింది. ఆమె విలాసం, వైభోగం చూసి దేశమంతా అవాక్కైంది. అదే ఓ రకంగా ఆమెపై నెగటివ్ ఇంప్రెషన్ కలిగేలా చేసింది. ఆమె బంగారు నగలన్నీ కోర్టుకు సీజ్ చేసింది.
         
మొన్నీమధ్యే అక్రమాస్తుల కేసులో ఎనిమిది నెలలు జైలు ఊచలు లెక్కబెట్టిన జయలలిత.. హైకోర్టులో తీర్పు ఆమెకు అనుకూలంగా రావడంతో.. మళ్లీ సీఎం పీఠమెక్కారు. అయితే ఆమెపై కర్ణాటక ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది కాబట్టి.. కేసు పెండింగ్ లో ఉంది.
        
జయ కేసు ఇంకా తేలలేదు కాబట్టి.. ఆమె బంగారు నగలన్నీ కర్ణాటక ట్రెజరీలోనే ఉన్నాయి. మొత్తం 28 కిలోల బంగారం, 800 కిలోల వెండి, 10వేల చీరలు, 91 వాచీలు, 44 ఎయిర్ కండిషనర్లు, 750 జతల చెప్పులు ఉన్నాయి. దీంతో ఆ ఆస్తులన్నీ ట్రెజరీ పాలయ్యాయి.
               
ఇప్పుడు జయలలిత కేసులో తుది తీర్పు వచ్చాకే.. అవి ఎక్కడ ఉండాలనేది కోర్టు డిసైడ్ చేయనుంది. ఇప్పుడు జయ కేసు ఏమవుతుందనేది కూడా అందరిలో ఆసక్తి ఏర్పడింది. దీంతో జయ నగలు భవిష్యత్తులో ఏమవుతాయో అనే ఉత్కంఠ ఉంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు