రేపు కానీ బ్యాంకుల్లో విత్ డ్రా చేసుకోకుంటే..

రేపు కానీ బ్యాంకుల్లో విత్ డ్రా చేసుకోకుంటే..

అందుబాటులోకి వచ్చిన టెక్నాలజీ పుణ్యమా అని బ్యాంకులకు వెళ్లే కష్టం చాలామందికి తప్పి పోయింది. అప్పుడప్పుడు దగ్గర్లోని ఏటీఎం సెంటర్ కు వెళ్లి.. అవసరమైన మొత్తాన్ని తెచ్చుకొని వాడుకోవటం అలవాటైంది. కానీ.. నోట్లను రద్దు చేస్తూ ప్రధాని మోడీ తీసుకున్న నిర్ణయంతో ఇప్పటివరకూ ఉన్న అలవాట్లు పోయి కొత్త అలవాట్లు వచ్చేశాయి. వీకెండ్ అయితే చాలు.. ఎక్కడికో ఒకచోటకు బయటకు వెళ్లే ప్రోగ్రాం పెట్టుకునేవారు. ఇప్పుడది పోయి.. ముందు ఏటీఎం దగ్గర క్యూలో నిలచొని డబ్బులు తెచ్చుకోవటమే పెద్ద పనిగా మారింది.

ఇక.. బ్యాంకుల్లో విత్ డ్రా చేసుకునే వారి కష్టాలు అన్నిఇన్ని కావు. నిబంధనల ప్రకారం రూ.24000 మొత్తాన్ని వారానికి చెల్లించాల్సి ఉంటుంది. కానీ.. బ్యాంకుల్లో నెలకొన్న నోట్ల కొరత కారణంగా రూ.2 నుంచి రూ.4వేలు మాత్రమే ఇస్తున్నారు. దీంతో.. పది వేల రూపాయిలు క్యాష్ కావాలంటే రెండు మూడు రోజుల పాటు బ్యాంకుల చుట్టూ తిరిగితే కానీ వర్క్ వుట్ కానిపరిస్థితి.

ఇక.. ఈ వీకెండ్ బ్యాంకులకు వెళ్లి.. డబ్బులు విత్ డ్రా చేసుకోవాలనుకునే వారు.. రానున్న రెండు రోజుల్లో డబ్బుల కోసం అవసరం ఉన్న వారు వెంటనే అలెర్ట్ అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే.. ఈ వారాంతంలో బ్యాంకులకు వరుసగా మూడు రోజలు పాటు సెలవులు రానున్నాయి. దీంతో.. డబ్బు అవసరం ఉన్న వారంతా ముందు అలెర్ట్ అయి.. తగిన ఏర్పాట్లు చేసుకోకుంటే అడ్డంగా బుక్ కావటం ఖాయం.

ఈ శనివారం డిసెంబరు నెలలో రెండో శనివారం కావటంతో ఆ రోజులు బ్యాంకులు పని చేయవు.ఇక.. ఆదివారం ఎప్పటిలానే సెలవు. ఇక.. మిగిలింది సోమవారం. అయితే.. ఆ రోజున ముస్లింల పండగ అయిన షిల్లార్ – ఉల్ – నబీ. దీంతో ఆ రోజు బ్యాంకులకు సెలవు. అంటే.. శుక్రవారం కానీ బ్యాంకుల్లో డబ్బులు విత్ డ్రా చేయటంలో ఏ మాత్రం జరగకపోయినా.. మూడు రోజుల పాటు చేతిలో డబ్బులకు కటకటలాడాల్సిందే. ఇక.. మంగళవారం బ్యాంకులు తెరుచుకున్నా.. మూడు రోజుల పాటు బ్యాంకులు పని చేయని నేపథ్యంలో రద్దీ ఎంత ఎక్కువగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. సో.. బ్యాంకుల్లో విత్ డ్రా చేసుకోవాల్సిన అవసరం ఉంటే.. ఇవాళ.. లేదంటే రేపు మాత్రం పని పూర్తి అయ్యేలా ప్లాన్ చేసుకోండి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు