మెరీనా బీచ్ లో జయకు డీఎంకే ఫ్లెక్సీ

మెరీనా బీచ్ లో జయకు డీఎంకే ఫ్లెక్సీ

పచ్చగడ్డి వేయకుండానే భగ్గుమనే కక్షలు డీఎంకే, అన్నడీఎంకేవి. ఇక జయ, కరుణ వ్యక్తిగత వైరం సరేసరి. వీళ్లిద్దరి బద్ధశత్రుత్వం గురించి దేశమంతటికీ తెలుసు. కనీసం ఒకరి దగ్గర మరొకరి పేరు వినడానికి ఇష్టపడరు. అలాంటిది జయ మరణం తర్వాత సీన్ రివర్సైంది.
       
జయ అంత్యక్రియల సమయంలోనే డీఎంకే కార్యకర్తలు భారీగా హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. పైగా పార్టీలు వేరైనా తమకూ అమ్మంటే అభిమానమని వారు చెప్పడం ఇంకా ఆశ్చర్యం కలిగించింది. అలాంటిది ఇప్పుడు ఏకంగా జయ కోసం మెరీనా బీచ్ లో ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం ఇంకా వింతగా ఉంది.
         
జయ సమాధి దగ్గర ఫ్లెక్సీ పెట్టిన డీఎంకే కార్యకర్తలు.. మమ్మల్ని ఎధుర్కోవడానికి మీలాంటి యోధురాలు లేదని బాథపడ్డారు. మీరు యుద్ధరంగంలో నిలబడ్డప్పుడు.. మా కమాండర్ ఇన్ చీఫ్ కరుణానిధి, జనరల్ స్టాలిన్ ఏమీ చేయలేకపోయారని, వేలమంది నేతలు తమకు ప్రత్యర్థులుగా ఉన్నా.. జయకు సాటిరారని వారు తమ అభిమానాన్ని చాటుకున్నారు.
        
అటు కరుణానిధి, స్టాలిన్ కూడా జయకు నివాళులు అర్పించారు. జయలలిత మరణం తమిళనాడుకు తీరని లోటన్నారు. సంక్షేమ పథకాలతో సామాన్యుల గుండెల్లో తిష్ట వేసిన జయలలిత.. తన అసాధారణ వ్యక్తిత్వంతో చివరకు ప్రత్యర్థి పార్టీల నేతలు, కార్యకర్తల్న కూడా అభిమానులుగా మార్చుకుని నిజమైన మహారాణి అనిపించుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English