జయ మరణం.. ఓ క్యాలెండర్ డేట్

జయ మరణం.. ఓ క్యాలెండర్ డేట్

జయ మరణానికి, ఓ షాపులో ముద్రించిన క్యాలెండర్ కు సంబంధం ఉందా. ఇప్పుడు తమిళనాడులో ఇదే ప్రశ్న తలెత్తుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో 2016 క్యాలెండ్ ముద్రించారు. అయితే ఓ షాపులో మాత్రం కాస్త వినూత్నంగా ఆలోచించి.. ప్రతి డేట్ మీదా తాత్వికతతో కూడిన వాక్యాలు ముద్రించారు.
          
డిసెంబర్ 5, 2016న క్యాలెండర్ తేదీపై.. ఓ గదిలో మరణం.. మరో గదిలో వారసత్వం కోసం కొట్లాట అని క్యాప్షన్ పెట్టింది. ఇప్పుడు ఆ వాక్యాలే నిజమయ్యాయి. అదే తేదీన ఆస్పత్రిలో ఓ గదిలో జయ మరణించగా.. పక్క గదిలో అన్నాడీఎంకే నేతలు కొత్త సీఎం ఎంపిక కోసం మంతనాలు జరిపారు
         
ఇప్పుడు క్యాలెండర్ వాక్యాలే నిజమయ్యాయని తమిళనాడులో కలకలం రేగుతోంది. ఇంకా ఈ నెల్లో ఏ తేదీల్లో ఏం రాశారో అని జనం సదరు షాపుకు క్యూ కడుతున్నారు. అసలే తమిళనాడుకు డిసెంబర్ చీకటి సెంటిమెంట్ ఉంది. ఇప్పుడు ఈ క్యాలెండర్ సెంటిమెంట్ తోడైంది.
        
తమిళనాట తిరుగులేని నేతలు రాజాజీ, పెరియార్, ఎంజీఆర్, జయ అందరూ డిసెంబర్లోనే మరణించారు. తమిళనాడుకు దుఃఖసాగరంలో ముంచి సునామీ కూడా డిసెంబర్లోనే వచ్చింది. శతాబ్దపు వరదలుగా అభివర్ణించిన చెన్నై వరదలు డిసెంబర్లోనే వచ్చి.. నగరాన్ని ముంచేశాయి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు