మళ్లీ కదులుతున్న విశాఖ రైల్వేజోన్

మళ్లీ కదులుతున్న విశాఖ రైల్వేజోన్

ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత నవ్యాంధ్ర ప్రజల తీరని కోరికలుగా మిగిలిన పోయిన ప్రత్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ అంశాల్లో ప్రత్యేక హోదా కల ముగిసిపోయినట్లు. ఇక మిగిలింది... విశాఖ రైల్వేజోన్. దానిపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ ఉన్నా కార్యాచరణ మాత్రం కనిపించడం లేదు. 

ఇదిగో ప్రకటన అదిగో ప్రకటన అంటూ కొద్దికాలం హడావుడి జరిగినా ప్రత్యేక రైల్వే జోన్ మాత్రం సిద్ధించలేదు.  ఒక దశలో రైల్వే మంత్రి సురేశ్ ప్రభు స్వయంగా విశాఖ వచ్చి దీనిపై ప్రకటన చేస్తారని అనుకున్నా కూడా అదీ వాయిదా పడింది. సురేశ్ ప్రభు రాష్ట్రానికి వచ్చినా ప్రకటన మాత్రం చేయలేదు.

దీనిపై టీడీపీ ప్రభుత్వం, ఏపీ బీజేపీ నేతలూ ప్రయత్న లోపం లేకుండా ఒత్తిడి చేసినా ఫలితం లేకపోయింది. తాజాగా మరోసారి విశాఖ రైల్వే జోన్ అంశం తెరపైకి రావడంతో ఈసారైనా పనవుతుందా లేదా అన్న మీమాంశ ప్రజల్లో ఏర్పడుతోంది.
    
ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నంలో రైల్వే జోన్‌ ఏర్పాటు చేయాలని తెలుగుదేశం పార్టీ, బిజెపి ఎంపీలు మళ్లీ డిమాండ్‌ చేస్తున్నారు. ఈ రోజు సాయంత్రం  వారు రైల్వే శాఖ మంత్రి సురేష్‌ ప్రభుతో సమావేశం కానున్నారు. నాలుగు జోన్లను కలిపి విశాఖ కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేయాలని టిడిపి, బిజెపి ఎంపీలు రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేయనున్నారు.
    
నిజానికి అన్నీ అనుకున్నట్లు జరిగితే ఈసరికే విశాఖ కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పడేది. కానీ.. తూర్పుకోస్తా రైల్వే జోన్ లో ఉన్న విశాఖను వదులుకోవడానికి ఒడిశా ప్రభుత్వం ఏమాత్రం ఇష్టంగా లేకపోవడంతోఏపీ ప్రజల కోరిక తీరడం లేదు. విశాఖ కేంద్రంగా భారీగా ఆదాయం ఆర్జించే తూర్పుకోస్తా రైల్వేకు ఒడిశాలోని ఖుర్దా రోడ్ హెడ్ క్వార్టర్.  దాంతో ఒడిశా దీనికి అడ్డుపుల్లలు వేస్తుండడంతో ప్రతిష్టంభన ఏర్పడుతోంది. ఈసారైనా పనవుతుందో లేదో చూడాలి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు