మగవారికి ఆమడ దూరంలో జయ..

మగవారికి ఆమడ దూరంలో జయ..

ధీరవనితగా గుర్తింపు పొందిన జయలలిత.. మగవారిని అస్సలు నమ్మరట. తన జీవితంలో నమ్మిన ఇద్దరు మగాళ్లూ నిండా ముంచారని.. అందుకే ఇక ఎవర్నీ నమ్మదలుచుకోలేదని జయ సన్నిహితులతో చెప్పేవారట. ఓ సమయంలో మీడియానూ కూడా నమ్మలేదట.

 జయ ఎంజీఆర్ పై ఎంతో నమ్మకం పెట్టుకున్నారు. కానీ ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఆయన సాయం చేయలేకపోయారు. తర్వాత శోభన్ బాబును మంచి స్నేహితుడిలా భావించారు. కానీ ఆయన కూడా ఆమె కష్టాల్లో ఉన్నప్పుడు ఓదార్పు ఇవ్వలేకపోయారు.

 అప్పట్నుంచి మగాళ్లపై అనుకోకుండా ద్వేషం పెంచుకున్న జయలిలత.. ఇక వాళ్లతో కఠినగా వ్యవహరించడం మొదలుపెట్టారు. మగాళ్లతో కాళ్లకు దండం పెట్టించుకోవడమే కానీ.. వారికి తనతో సమానంగా కూర్చునే స్థాయి లేదని అనుకునేవాళ్లు.

 రాజకీయ జీవితం ప్రారంభించిన తొలినాళ్లలో మీడియాకు ఇచ్చిన ఇంటర్వూలు కూడా సొంత టేపిరికార్డర్లో రికార్డ్ చేసేవారట. తన వ్యాఖ్యలు వక్రీకరిస్తారని ఆమె భయం. కానీ అదీ ఒకందుకు మంచిదే అని సీనియర్ జర్నలిస్టులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు