జయ మాట్లాడారు.. ఇందిర వచ్చారు..

జయ మాట్లాడారు.. ఇందిర వచ్చారు..

జయలలిత మొదటిసారి రాజ్యసభకు ఎన్నికైనప్పుడు.. సినిమా నటి ఏం మాట్లాడుతుందిలే అనుకున్నారు. కానీ జయ ఫస్ట్ స్పీచ్ వినడానికే ఏకంగా సభలో లేని అప్పటి ప్రధాని కూడా పరుగు పరుగున సభకు వచ్చారంటే..ఆమె ఎంత మంచి వక్తో తెలుస్తోంది.

 ఎప్పుడూ బిజీగా ఉండే అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ జయ ప్రసంగం సమయంలో రాజ్యసభలో లేరు. మహిళా సాధికారత గురించి జయ సూపర్ స్పీచ్ ఇస్తున్నారన మంత్రులు చెప్పడంతో.. ఇందిర సభకు వచ్చి జయ ప్రసంగం విని మరీ అభినందించారు.

 జయ స్పీచ్ సమయంలో గ్యాలరీ పూర్తిగా నిండిపోయింది. ఎప్పుడూ సభకు రాని ఎంపీలు కూడా వచ్చి ప్రసంగం పూర్తయ్యే వరకూ ఉన్నారు. అప్పట్లో తాను లోక్ సభ ఎంపీగా ఉన్నానని, ప్రస్తుత రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ కురియన్ గుర్తుచేసుకున్నారు.

 జయ పేదల మనసులో ఉన్నారని, ఆమె సామాన్యుల కోసమే జీవించారని గుర్తుచేశారు. జయ నిజమైన ప్రజా నాయకురాలని, ఆమె ఏం చేసినా జనం కోసమే అంటున్నారు కురియన్.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు