దటీజ్ జయలలిత..

దటీజ్ జయలలిత..

నిర్మలమైన ప్రేమ.. శిలను మించిన కర్కశత్వం. అనురాగాలు కురిపించే కుళ్లు. క్రోధంతో రగిలిపోయే అవే కళ్లు. ప్రేమిస్తే అందలం ఎక్కిస్తారు. ద్వేషిస్తే పాతాళానికి తొక్కేస్తారు. ఇక జయ పగ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆమె పగ బడితే ఎవరైనా ఇబ్బందిపడాల్సిందే. ఇదీ జయలలిత వ్యక్తిత్వం.

 అసలు నలుగుర్లోకి రావడానికే భయపడే యువతి.. అమ్మ చనిపోయాక ఒంటరితనంలోకి వెళ్లిన మనిషి.. తిరుగులేని నేతగా ఎదగడ విధి విలాసం మాత్రమే కాదు. అవమానాల పరంపరం ఫలితం కూడా. భారతంలో ద్రౌపది తర్వాత జయ పడినన్ని అవమానాలు మరెవరూ పడలేదంటే.. అతిశయోక్తి కాదు.

 అభిమాన నేత ఎంజీఆర్ అంతిమయాత్రకు వెళ్తే.. కాలితో తన్నారు. గోళ్లతో గిచ్చారు. చేతితో రక్కారు. ఈడ్చి కింద పారేశారు. నువ్వెంత, నీ బతుకెంత అని అవమానించారు. సినీతారగా శిఖరస్థాయిలో వెలుగుతున్న జయలలితకు అది ఘోర అవమానం. సైలంట్ గా ఇంటికి వచ్చి ఏడ్చిన జయలలిత.. అప్పట్నుంచి జీవితంలో ఇక ఏడవకూడదని నిశ్చయించుకున్నారు.

 నువ్వెంత అన్నవాళ్లతోనే కాళ్లు పట్టించుకున్నారు. చివరకు తమిళనాడు అసెంబ్లీలో తనను పైశాచికంగా అవమానించిన కరుణానిధిని.. అర్థరాత్రి జైలుకీడ్పించి జయ పగేంటో చాటిచెప్పారు. అప్పట్నుంచీ కరుణ జయతో జాగ్రత్తగా ఉంటున్నారంటే.. అమ్మ పవరేంటో అర్థమవుతోంది.

 తన రాజకీయ జీవితం ఒడిదుడుకుల్లో ఉన్నా.. అమ్మ పాలనా రథాన్ని మాత్రం పరుగులెత్తిస్తూనే ఉన్నారు. సామాన్యుల కోసం దేశంలో ఎవరూ కనీవినీ ఎరుగని పథకాలు సమర్థవంతంగా అమలుచేసి పేదల గుండెగుడిలో దేవతగా కొలువుదీరారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు