తెలుగు నేతలతో అమ్మకు సంబంధాలు

తెలుగు నేతలతో అమ్మకు సంబంధాలు

జయ రాజకీయ జీవితంలో తెలుగు గవర్నర్ల పాత్ర చాలా ఉంది. జయ ఫస్ట్ టైమ్ సీఎం అయినప్పుడు మాజీ సీఎం మర్రి చెన్నారెడ్డి అక్కడ గవర్నర్ గా ఉన్నారు. కానీ వీరిదద్రికీ అస్సలు పడేది కాదు. ఇద్దరూ అధికార దర్పాన్ని చూపించాలని చూసి.. ఉప్పు, నిప్పులా ఉండేవాళ్లు.
     
ఇక మొన్నటివరకు తమిళనాడు గవర్నర్ గా ఉన్న రోశయ్యతో అమ్మకు మంచి సంబంధాలుండేవి. కీలక విషయాల్లో రోశ్యయ సలహాలు కూడా తీసుకునేవాళ్లని సమాచారం. రోశయ్య పదవీకాలం పొడిగింపుపై జయ ప్రధానికి లేఖ రాయడమే వారి అనుబంధానకి నిదర్శనం.
     
ఇక రోశయ్య తర్వాత విద్యాసాగర్రావు మరో తెలుగు వ్యక్తి.. తమిళనాడుకు ఇన్ఛార్జ్ గవర్నర్ గా ఉన్నారు. జయ ఆస్పత్రిలో చేరినప్పట్నుంచీ ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ.. కేంద్రానికి సమాచారం చేరవేస్తూ వచ్చారు.
      
వీరితో పాటు టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ తో జయకు విడదీయరాని అనుబంధం ఉంది. హీరో, హీరోయిన్లుగా గతంలో ఉండే స్నేహం తర్వాత బలపడింది. వీరిద్దరి స్నేహానికి గుర్తుగానే తెలుగు గంగ సాకారమైంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు