కన్నీరుమున్నీరైన సూపర్ స్టార్

కన్నీరుమున్నీరైన సూపర్ స్టార్

ఒకప్పుడు జయ గెలిస్తే.. తమిళనాడును దేవుడు కూడా కాపాడలేడని స్టేట్ మెంట్ ఇచ్చిన సూపర్ స్టార్ రజినీకాంత్.. ఇప్పుడు అమ్మను చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. సంక్షేమ పథకాలతో పేదల జీవితాల్లో వెలుగును నింపిన జయ ఇక లేదని విలపించారు. తన కుటుంబసభ్యులతో కలిసి వచ్చిన రజనీ కాంత్.. భావోద్వేగాన్ని ఆపుకోలేకపోయారు.
           
జయ బద్ధ శత్రువులు డీఎంకే నేతలు కూడా సంతాపం తెలిపారు. స్టాలిన్, కనిమొళి వచ్చి అన్నాడీఎంకే శ్రేణులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జయలలిత భౌతిక కాయానికి నివాళులు అర్పించి ఆమె తమిళనాడుకు చేసిన సేవల్ని కొనియాడారు.
          
వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు జయకు నివాళులు అర్పించారు. కాంగ్రెస్ నేత ఖుష్బూ, మద్రాస్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, నడిగర్ సంఘం అధ్యక్షుడు, నటుడు నాజర్, ప్రధాన కార్యదర్శి విశాల్, సినీనటులు కోవైసరళ, టీ.రాజేందర్ అమ్మకు ఆఖరి వందనం సమర్పించారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు