అంతిమయాత్రలో ఘోరంగా అవమానించారు

అంతిమయాత్రలో ఘోరంగా అవమానించారు

కలియుగ ద్రౌపది జయలలిత ఆమెకు జరిగిన అవమానం గురించి ఆమె మాటల్లోనే ఓ సందర్భంలో వివరించారు. సాధారణంగా వ్యక్తిగత విషయాలు బయటకు చెప్పని జయలలిత.. చాలా రేర్ గా ఓపెన్ అవుతారు.

ఎంజీఆర్ భౌతికకాయాన్ని చూడటానికి వచ్చినప్పుడు తనకు రాజకీయాలు చేయాలనే ఆశే లేదని, కానీ ఆ అవమానమే తన జీవితాన్ని మలుపు తిప్పిందన్నారు. జయ ఎక్కడ తమకు పోటీ అవుతారోననే భయంతో జానకి సన్నిహితులు జయను మాటలతో కాకుల్లా పొడిచారు.

ఎంజీఆర్ అంతిమయాత్రలో ఇంకా ఘోరంగా అవమానించారు. ఈడ్చి కింద పారేశారు. జానకి సోదరుడి కొడుకు ఆమెను చెంపదెబ్బ కొట్టారు. ఈ అవమానంతో ఆమె బాగా అవమానపడ్డారు. కొన్నిరోజులు ఇంటికే పరిమితమయ్యారు. ఆ తర్వాత పార్టీనే తన దారిలోకి తెచ్చుకుని రాళ్లేసిన వాళ్లతోనే పూలు జల్లించుకున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు