ఆంధ్రాబ్యాంకు నుంచి అప్పు తీసుకుంటున్న కేసీఆర్

ఆంధ్రాబ్యాంకు నుంచి అప్పు తీసుకుంటున్న కేసీఆర్

పేరులో ఆంధ్రా అన్న మాట కనిపించినా.. వినిపించినా ఉద్యమనేతగా మండిపడే టీఆర్ఎస్ అధినేత కమ్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ లో మార్పు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఆంధ్రా అన్న పదమంటే తనకు ఎవర్షన్ అన్నట్లుగా వ్యవహరించే ఆయన.. ముఖ్యమంత్రిగా మాత్రం ఆయన తనలోని మరో కోణాన్ని ప్రదర్శిస్తుంటారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆంధ్రా బ్యాంకుపైనా తెలంగాణ ఉద్యమకారుల మాటలు సాగేవి.

అందుకు భిన్నమైన పరిస్థితులు తాజాగా చోటు చేసుకుంటున్నాయని చెప్పకతప్పదు. తాను ఏ మాత్రం ఇష్టపడని 'ఆంధ్రా' పేరుతో ఎంత రాజకీయం చేయాలో అంతగా చేసిన కేసీఆర్.. ఇప్పుడదే పేరుతో వ్యాపారం చేయటం ఆయన చాణుక్యానికి నిదర్శనంగా చెప్పుకోవాలి. తాజాగా.. ఆయన ఆంధ్రాబ్యాంకు ఎండీ.. సీఈవో సురేశ్ ఎన పటేల్ తో భేటీ అయిన కేసీఆర్.. తెలంగాణ రాష్ట్ర సర్కారు చేపట్టిన ప్రాజెక్టుల గురించి చర్చించినట్లు చెబుతున్నారు.

టీఆర్ఎస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న మిషన్ భగీరధ.. సాగునీటి కార్యక్రమాల తీరుతెన్నుల్ని వివరించిన ఆయన.. ఈ కార్యక్రమాలకు అవసరమైన నిధుల్ని బ్యాంకు నుంచి కోరినట్లుగా చెబుతున్నారు. వాస్తవానికి మిషను భగీరథకు ఆంధ్రా బ్యాంకు ఇప్పటికే రుణాన్ని ఇచ్చిందని చెప్పాలి. నగదు రహిత లావాదేవీల్ని ప్రోత్సహించాలన్న నేపథ్యంలో.. ఈ అంశంపై ఆంధ్రాబ్యాంకు సీఈవోతో మాట్లాడిన ఆయన.. తెలంగాణకు అవసరమైన అప్పు విషయంపై కీలక చర్చలు జరిపినట్లుగా చెబుతున్నారు. ఏమైనా.. తనకు నచ్చని ఆంధ్రా పదం ఉన్న బ్యాంకు నుంచి అప్పు తీసుకోవటం చూస్తే.. .ఇష్టాయిష్టాలన్నవి అవసరాలకు తగ్గట్లుగా మారుతుంటాయన్న విషయాన్ని కేసీఆర్ తన చేతలతో చేసి చూపిస్తారని చెప్పక తప్పదు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు