ఊగిసలాడుతున్న తమిళ స్తంభాలు

ఊగిసలాడుతున్న తమిళ స్తంభాలు

తమిళనాడు రాష్ట్రానికి రెండే మూలస్తంభాలు. ఒకటి జయలలిత.. మరొకటి కరుణ. మూడు దశాబ్దాలుగా రాజకీయం వీరిద్దరి మధ్యే తిరుగుతోంది. యాదృచ్ఛికమో,విధిలీలో కానీ.. ఇద్దరు నేతలు ఒకేసారి అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు.
       
అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు సీఎం జయలలిత.. ఇప్పటికే అపోలోలో చికిత్స పొందుతుండగా.. డీఎంకే కురువృద్ధుడు కరుణానిధి కూడా అనారోగ్యంతోకావేరీ ఆస్పత్రిలో జాయిన్ అయ్యారు. దీంతో అగ్రనేతల ఆరోగ్యంపై ఆందోళన నెలకొంది.
        
వీళ్ల ఆరోగ్యం సంగతి పక్కనపెడితే.. సుదీర్ఘ కాలం అగ్రనేతలు ఆస్పత్రిలో ఉంటే.. తమిళ రాజకీయాల్లో పెనుమార్పులు చోటుచేసుకోనున్నాయి. ఇప్పటివరకూఅన్నాడీఎంకేకు అమ్మే అన్నీ. ఇప్పుడు కొత్తగా ఎవరు నాయకత్వం వహిస్తారనేది చిక్కు ప్రశ్న. డీఎంకేకు ఆ బాధ లేదు. ఇప్పటికే స్టాలిన్ వారసుడని అందరికీతెలుసు.
         
కానీ అటు అన్నాడీఎంకేలో కానీ, ఇటు డీఎంకేలో కానీ జయ, కరుణల జనాకర్షణకు సాటివచ్చే నేత మరొకరు లేదు. అదే పెద్ద ప్రతికూలత. ఇక తమిళనాడులోభవిష్యత్ లో కొత్త నేత ఆవిర్భవిస్తారని రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు