అప్పుడు ఎమర్జెన్సీ.. ఇప్పుడు నోట్ల రద్దు

అప్పుడు ఎమర్జెన్సీ.. ఇప్పుడు నోట్ల రద్దు

బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి మరోసారి కేంద్రానికి ఇబ్బందికరమైన వ్యాఖ్యలు చేశారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఎమర్జెన్సీతో పోల్చారు. ఎమర్జెన్సీ విధించారని ఇప్పటికీ ఇందిరను విమర్శిస్తున్న బీజేపీ నేతలు.. నోట్ల రద్దు పర్యవసానాల్ని తెలుసుకోవాలని హెచ్చరించారు.
       
పెద్దనోట్ల రద్దు పేరుతో సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని ప్రశంసిస్తూనే.. అమలు మాత్రం ఘోరంగా ఉందన్నారు. ప్రజలు బాగుందన్నారని జబ్బలు చరచుకుంటే.. భవిష్యత్ లో ఇబ్బంది తప్పదని వార్నింగ్ ఇచ్చారు. జీతాలు పడి మూడురోజులైనా చాలామందికి డబ్బులు రాలేదని గుర్తుచేశారు.
       
మరో నెల ఇవే కష్టాలు కొనసాగితే.. ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తుతుందని జోస్యం చెప్పారు. గతంలో ఇందిర ఎమర్జెన్సీ విధించినప్పుడు అందరూ స్వాగతించారని, కానీ కాలం గడిచేకొద్దీ దాని చేదు అనుభవాలు అందరికీ అర్థమయ్యాయని గుర్తుచేశారు.
      
నోట్ల రద్దు కూడా చేదు మాత్రేనన్న స్వామి.. ప్రధాని మోడీ పరిస్థితిని చక్కదిద్దకపోతే కేంద్ర ప్రభుత్వం పుట్టి మునుగుతుందన్నారు. స్వామి వ్యాఖ్యలతో బీజేపీలో కలకలం రేగుతోంది. ఇప్పటిదాకా నోరు కట్టేసుకున్న బీజేపీ ఎంపీలు కూడా స్వామి నిజమే చెప్పారని వత్తాసు పలుకుతున్నారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు