మెక్ గ్రాత్ తో కష్టమంటున్న ద్రవిడ్

మెక్ గ్రాత్ తో కష్టమంటున్న ద్రవిడ్

అది 2003 క్రికెట్ వాల్డ్ కప్ ఫైనల్. అప్పటి వరకు అన్ని మ్యాచ్ ల్లో ఇరగదీసిన మాస్టర్ బ్లాస్టర్ సచిన్.. మాంచి ఊపుమీదున్నాడు. అప్పటి ప్రపంచ నంబర్ వన్ బౌలర్ మెక్ గ్రాత్ బౌలింగ్ లో వరుసగా రెండు బాల్స్ ను ఫోర్లు కొట్టాడు. అభిమానులు కేరింతలు కొడుతున్నాడు. కానీ మెక్ గ్రాత్ కూల్ గా బంతి విసిరాడు. అంతే సచిన్ క్యాచ్ ఇచ్చి ఔటయ్యాడు.
    
 మెక్ గ్రాత్ బౌలింగ్ ఏంటో చెప్పడానికి ఈ చిన్న ఎగ్జాంపుల్ చాలు. నిజానికి అందరూ పాంటింగ్ భారత్ కు విజయం దూరం చేశాడనుకుంటారు కానీ.. నిజమైన విలన్ మెక్ గ్రాతే. అదే నిజమని ఇప్పుడు ఇండియా వాల్ ద్రావిడ్ కూడా చెబుతున్నాడు. తాను ఎదుర్కున్న బౌలర్లలో మెక్ గ్రాతే కఠినుడంటున్నాడు.
       
సూపర్ డిఫెన్స్ ఆడటంలో ఆరితేరిన ద్రవిడ్ కూడా మెక్ గ్రాత్ బౌలింగ్ లో ఇబ్బందిపడేవాడట. పదే పదే ఆఫ్ స్టంప్ లోగిలిలో బంతి విసిరి తెగ ఇబ్బందిపెట్టేవాడట. మెక్ గ్రాత్ బౌలింగ్ లో బాల్స్ కాచుకోవడం చాలా కష్టమంటున్నాడు మిస్టర్ డిపెండబుల్.
        
పేస్, లైన్ అండ్ లెంగ్త్, యాక్యురసీ, కంట్రలో అన్నీ పర్ఫెక్ట్ గా మెక్ గ్రాత్ చూసుకుంటాడన్న ద్రవిడ్.. అతడి బౌలింగ్ లో సింగిల్ లేదా ఎక్స్ ట్రా రావాలని కోరుకంటారని కితాబిచ్చాడు. తాను ఎదుర్కున్న టీమ్స్ లో ఆసీస్ బెస్టని, బౌలర్స్ లో మెక్ గ్రాత్ సూపరని చెప్పాడు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు