ఇండియాను కలిసి కుమ్మేద్దాం

ఇండియాను కలిసి కుమ్మేద్దాం

కశ్మీర్ అల్లర్లకు కారణమైన మరణించిన ఉగ్రవాది బుర్హాన్ వానీ.. ముంబై దాడులు సూత్రధారి హఫీజ్ సయూద్ పెద్ద స్కెచ్చే వేశారు. ఇద్దరూ కలిసి ఇండియాను నామరూపాల్లేకుండా చేయాలుకున్నారు. వీరిద్దరూ మాట్లాడుకున్న ఆడియో టేప్ బయటపడటంతో.. నిర్ఘాంతపోయే నిజాలు వెలుగుచూశాయి.
            
జులై 8న తాను ఎన్ కౌంటర్ కావడానికి ముందు బుర్హాన్ వానీ హఫీజ్ సయీద్ తో ఫోన్లో మాట్లాడాడు. ఇప్పటికే ఇండియన్ ఆర్మీపై పైచేయి సాధించామని, ఇకపై ఆధిపత్యాన్ని సాగిద్దామని ఇద్దరూ అనుకున్నారు. హఫీజ్ సయీద్ ఆయుధాలు, ఆశీర్వాదాలు ఇవ్వాలని బుర్హాన్ వానీ కోరాడు.
                   
ఈ టేపును నిజమేనని ఇండియా ఇంటెలిజెన్స్ అధికారులు ధృవీకరించడంతో.. ఇప్పుడు కలకలం రేగుతోంది. ఇలాంటి క్రూరమైన ఆలోచనలు ఉన్న బుర్హాన్ వానీని కశ్మీర్లో కొన్ని వేర్పాటువాద గ్రూపులు అమరవీరుడిగా కీర్తించడంపై విమర్శలు చెలరేగుతున్నాయి.
          
బుర్హాన్ వానీ అంతటితో ఆగలేదు.. ఏకంగా హిజ్బుల్ ముజాహిదీన్, లష్కరే తోయిబాలు కలిసి పనిచేయాలి, అప్పుడే కశ్మీర్ నుంచి ఇండియన్ ఆర్మీని తరిమికొట్టగలమని చెప్పాడు. బుర్హాన్ బతికుంటే ఈ పాటికి కశ్మీర్లో విధ్వంసం సృష్టించేవాడని అధికారులు చెబుతున్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు