ప్రపంచం మోడీ అంటుంటే...ఇండియా సన్నీ అంటోంది

ప్రపంచం మోడీ అంటుంటే...ఇండియా సన్నీ అంటోంది

స‌న్నీ లియోన్‌... మాజీ ఫోర్న్ స్టార్ అయిన ఈ సినీ న‌టికి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న పాపులారిటీ గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. అయితే స‌న్నీ క్రేజ్ రోజురోజుకు భారీగా పెరిగిపోతుంద‌ని, అందులోనూ భార‌త్ లో భారీ అభిమానుల‌ను ఈ భామ ద‌క్కించుకుంటోంద‌ని మ‌రోమారు రుజువైంది. యాహూ ఇండియా తాజాగా విడుద‌ల చేసిన నివేదిక ప్ర‌కారం 2016లో మోస్ట్‌ సెర్చ్‌ డ్‌ సెలెబ్రిటీ జాబితాలో స‌న్నీ లియోన్ టాప్‌లో నిలిచింది.అంతే కాదు ఆమె వ‌రుస‌గా ఐదో ఏడాది ఈ ర్యాంకును ద‌క్కించుకుంది  కూడా! పైగా ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ, బాలీవుడ్ స్టార్ స‌ల్మాన్ ఖాన్ వంటి వారిని దాటివేసి మ‌రీ నంబ‌ర్ వ‌న్ స్థానంలో స‌న్నీ లియోన్ నిలవ‌డం విశేషం. స‌న్నీ తర్వాత బాలీవుడ్‌ హీరోయిన్లు బిపాసా బసు, దీపికా పదుకోన్‌, కత్రినా కైఫ్‌ ఉన్నారు.  

ఇక అత్య‌ధికంగా వెతికిన మ‌గ‌మ‌హారాజుల్లో కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ టాప్ లో నిలిచాడు. ఆ త‌ర్వాతి స్థానాల్లో టీవీ క‌మెడీ స్టార్ అయిన క‌పిల్ శ‌ర్మ‌, బాలీవుడ్ బాద్ షా అమితాబ్ బ‌చ్చ‌న్, షారూక్ ఖాన్‌, అమిర్ ఖాన్‌లు ఉన్నారు. అయితే ఈ స‌ర్వేలో ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఎన్నో స్థానంలో ఉన్నార‌నేది వెల్ల‌డించ‌లేదు. కానీ స్టార్లంద‌ర‌ని దాటుకొని మ‌రీ పోర్న్ స్టార్ టాప్ లో నిల‌వ‌డం ఆస‌క్తిక‌రంగా మారింది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు