జంబో బస్ రెడీ

జంబో బస్ రెడీ

జంబో జెట్ పేరు విన్నాం కానీ.. జంబో బస్సేంటి అనుకుంటున్నారా. ఉందండీ. స్వీడన్ కంపెనీ కొత్తగా రిలీజ్ చేసింది. అయితే ఈ బస్సు బ్రెజిల్ కు మాత్రమే స్పెషల్.  ఏంటి అంత స్పెషల్ అనుకుంటున్నారా. రియోడిజనిరో రోడ్లే స్పెషల్. అక్కడ బస్సుల కోసమే ప్రత్యేకంగా లైన్లున్నాయి.
      
మామూలుగా మన ఆర్టీసీ బస్సుల్లో 35 నుంచి 40 మంది ప్రయాణికులు పడతారు. ఇక వోల్వో బస్సులు తీసుకున్నా.. మహా అయితే 60 మంది. కానీ లేటెస్ట్ ఓల్వో బస్ లో మాత్రం దాదాపు 300 మంది పడతారట. ఎందుకంటే మూడు బస్సులు కలిపి ఒకే బస్సుగా తయారుచేశారు.
           
ఈ బస్సు పొడవే 30 మీటర్లు. బ్రెజిల్లో రవాణా వ్యవస్థ మరింత సమర్థంగా నిర్వహించాలన్న అక్కడి సర్కారు కోరిక మేరకు ఓల్వో ఈ బస్ తయారుచేసింది. గ్రాస్ ఆర్కిటిక్ 300 పేరుతో తయారుచేసిన ఈ బస్ ను.. ఫ్రీ ట్రాన్స్ రియో ఎగ్జిబిషన్లో ప్రదర్శించింది.
       
జనమంతా జంబో బస్ చూసి ఫ్లాటైపోయారు. ఇంత పెద్ద బస్సు ఒక్కసారి ఎక్కితే చాలని ముచ్చటపడ్డారు. జనాల ఆధరణ చూస్తుంటే.. ఈ బస్సు మూవింగ్ మ్యూజియంలా మారే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. అవసరం ఉన్నా.. లేకపోయినా.. ఒక్కసారైనా ఎక్కిదిగాలనుకునే జనానికి లోటుండక పోవచ్చు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English