భారతీయులపై ట్రంప్ మోజు

భారతీయులపై ట్రంప్ మోజు

అమెరికా నూతన అధ్యక్షుడుగా ఎన్నికైన ట్రంప్ ఐ లవ్ ఇండియా అంటున్నారు. అదేంటి ప్రచారంలో ఇదే మంత్రం జపించారుగా అంటారా. అఫ్ కోర్స్ నిజమేనండి. కానీ ఓట్ల కోసం అనుకున్నాంగా మనమంతా. కానీ తనకూ కాస్త ప్రేమ ఉందని ట్రంప్ నిరూపించుకుంటున్నారు. వరుసగా రెండో భారతీయ అమెరికన్ ను కీలక పదవిలో నియమించారు.
       
ఇప్పటికే నిక్కీ హేలీని ఐరాసలో అమెరికా వ్యవహారాల ప్రతినిధిగా నియమించిన ట్రంప్.. ఇప్పుడు మరో భారతీయ అమెరికన్ సీమా వర్మకు ఆరోగ్య విబాగంలో సెంటర్స్ ఫర్ మెడికేర్ అండ్ మెడికైడ్ సర్వీసెస్ ఇంఛార్జ్ పదవిచ్చారు. స్వతహాగా డాక్టర్ అయిన సీమావర్మ తన బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారని ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు.
             
డాక్టర్ సీమా వర్మ ప్రస్తుతం ఎస్వీసీ అనే జాతీయ ఆరోగ్య విధాన సలహా సంస్థను స్థాపించారు. దానికి సీఈవోగా ఉన్నారు. ఈ అనుభవంతో జాతీయ ఆరోగ్య విధానం రూపకల్పన, అమలులో ఆమె కీలక పాత్ర పోషిస్తారనేది ట్రంప్ భావన.
         
మొత్తం మీద తాను ఎన్నికల కోసం ఐలవ్ ఇండియా అనలేదని. నిజంగా ఐలవ్ ఇండియా అన్నానని నిరూపించుకుంటున్నారు ట్రంప్. పూర్తిస్థాయిలో అధ్యక్షుడయ్యాక కూడా ట్రంప్ భారతీయ అనుకూల విధానాలు అవలంబిస్తారని ఎన్నారైలు ఆశగా ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు