అల్ ఖైదా ఉగ్రవాది.. టీసీఎస్ ఇంజినీర్

అల్ ఖైదా ఉగ్రవాది.. టీసీఎస్ ఇంజినీర్

ఏంటి ఇదేదో సినిమాల్లోలాగా డబుల్ పోజనుకుంటున్నారా. అదేం కాదు. నిజ్జంగా నిజం. కార్పొరేట్ కంపెనీలు తమ ఉద్యోగుల ప్రొఫైల్ గురించి ఎంత బాగా తెలుసుకుంటున్నాయో ఈ ఘటన రుజువుచేస్తోంది. అల్ ఖైదా ఉగ్రవాదుల కోసం మధురైలో గాలించిన ఎన్ఐఏ అధికారులు నిర్ఘాంతపోయే నిజాలు వెలుగుచూశాయి.
    
టెర్రరిస్టుల గ్యాంగ్ లీడర్ టీసీఎస్ కంపెనీలో పనిచేస్తున్నాడని తెలిసి.. అధికారులు ఉలిక్కిపడ్డారు. సాఫ్ట్ వేర్, ఇతర కార్పొరేట్ ఉద్యోగాల్లో ఇంకెంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అని ఆరా తీస్తున్నారు. టీసీఎస్ ఇంజినీర్ గా పనిచేస్తున్న ఉధ్యోగి.. టెర్రరిస్టుల్ని లీడ్ చేసి.. ఏకంగా పీఎంనే చంపాలని చూడటం సంచలనం సృష్టిస్తోంది.
                 
గ్యాంగ్ లీడర్ సులేమాన్ మధురైలోని కరిమ్సాపల్లి వాసల్ ప్రాంత వాసి. ప్రస్తుతం చెన్నై తిరువన్మియూర్ లో నివాసం ఉంటున్నాడు. ఇతడితో పాటు పెయింటర్ అబ్బాస్, చికెన్ షాప్ శామ్సన్ కరీమ్ రజా అల్ ఖైదా టెర్రరిస్టులుగా పనిచేస్తున్నారు. వీరంతా కలిసి దేశంలో భారీ కుట్రకు ప్లాన్ చేస్తున్నారు.
                
మొత్తం 22 మంది వీవీఐపీల్ని ఈ గ్యాంగ్ టార్గెట్ చేసింది. వీరి దగ్గర అల్ ఖైదా ఇండియా మ్యాప్ కూడా బయటపడింది. ద బేస్ మూమెంట్ ఆఫ్ అల్ ఖైదా అనే పేరుతో గ్రూప్ తయారైంది. 1998లో నిషేధానికి గురైన అల్ ఉమా ఉగ్రవాద సంస్థలో కూడా వీళ్లు సభ్యులుగా పనిచేశారు

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు

 
Home
వార్తలు
ఫోటో గ్యాలరీ
English