ఒబామా, ట్రంప్ ను వెనక్కునెట్టిన మోడీ

ఒబామా, ట్రంప్ ను వెనక్కునెట్టిన మోడీ

నరేంద్ర మోడీ.. ఉరఫ్ నమో. దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగానూ నమో పేరు మార్మోగిపోతోంది. సార్వత్రిక ఎన్నికల సమయంలో బీజేపీ నేతలు నమో జపం చేశారు. ఫలితాలతో జనం కూడా నమో జపం చేశారు. ఇప్పుడు ఏకంగా ప్రపంచమే నమో జపం చేస్తోంది. టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ పోల్లో మోడీ దూసుకుపోతున్నారు.
            
మొన్న సర్జికల్ స్ట్రైక్స్.. నిన్న పాకిస్థాన్ కట్టడి.. ఇప్పుడు పెద్ద నోట్ల రద్దు.. ఇలా మోడీ అన్నీ సాహసోపేత నిర్ణయాలే తీసుకుంటున్నారు. భారత్ లో అత్యధిక ట్విట్టర్ల ఫాలోవర్లను కలిగిన మోడీ.. ఇప్పుడు ప్రపంచ ప్రముఖుల్ని కూడా పక్కనపెట్టి దూసుకుపోతున్నారు.
            
ఇప్పటికే మోడీ టైమ్స్ పోల్లో 21 శాతం ఓట్లు సాధించారు. సమీప ప్రత్యర్థుల కంటే ఈయన ఓటింగ్ శాతం చాలా ఎక్కువ కాబట్టి.. మోడీ గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. డిసెంబర్ 4తో రీడర్స్ ఓటింగ్ ప్రక్రియ ముగియనుంది.
             
టైమ్స్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ రేసులో మోడీతో పాటు ఒబామా, ట్రంప్, హిల్లరీ, పుతిన్, ఉత్తరకొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్, బ్రిటన్ పీఎం థెరిసా మే, చైనా అధ్యక్షుడు జిన్ పింగ్.. ఇంకా అమెరికన్ ముస్లిం సైనికుడి పేరెంట్స్.. ఎఫ్ బీఐ మాజీ చీఫ్ జేమ్స్ కామీ కూడా ఉన్నారు.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు