పశ్చిమాన ఉదయించిన సోషలిస్టు సూరీడు

పశ్చిమాన ఉదయించిన సోషలిస్టు సూరీడు

క్యూబా అంటే క్యాస్ట్రో.. క్యాస్ట్రో అంటే క్యూబా అన్నంతగా జనంలో మమేకమయ్యారు. అమెరికాలో ఒకటో వంతు భూభాగం ఉన్న దేశాన్ని.. ప్రపంచ యవనికపై అమెరికా జెండాతో సమానంగా తలెత్తుకునేలా చేశారు. అమెరికా అధ్యక్షుడి ప్రసంగానికి ఎంత విలువ ఉందో.. క్యూబా క్యాస్ట్రో ప్రసంగానికీ అంతే విలువ ఉందంటే అతిశయోక్తి కాదు.
           
ప్రపంచపు పూర్వార్థగోళంలోనే అరుణకాంతులు వెలుగులీనుతున్న కాలమది. పశ్చిమార్థగోళం పాశ్చాత్య పోకడలతో మత్తెక్కిన కాలమది. అప్పుడే క్యూబాలో క్యాస్ట్రో అనే విప్లవ కెరటం ఉవ్వెత్తున లేచింది. పశ్చిమార్థగోళంలో తొలిసారి అరుణకిరణాలు ప్రసరించాయి. ఐదు దశాబ్దాలుగా నిర్విఘ్నంగా ప్రసరిస్తూనే ఉన్నాయి.
           
సోషలిస్టుగా క్యూబా గద్దెనెక్కిన క్యాస్ట్రో.. తర్వాత కమ్యూనిస్టు విధానాలు అమలుచేశారు. చివరకు ఆర్థిక సంక్షోభం సమయంలో ఇష్టం లేకపోయినా క్యాపిటలిస్టుల చిహ్నమైన డాలర్ ను అనుమతించారు. కానీ ఏం చేసినా జనం కోసమే చేశారు. తుదిశ్వాస వరకూ వాళ్ల కోసమే బతికారు.
        
క్యూబాను మానవాభివృద్ధి సూచికలో అత్యున్నత స్థానంలో నిలపడంలో ఆయన ప్రతిభ అనితర సాధ్యం. విద్యా, వైద్యరంగాల్లో క్యూబాను కొట్టే దేశం లేదు. ప్రపంచపు పంచదార గిన్నె క్యూబా. సమష్టి వ్యవసాయ విజయానికి అరుదైన నిదర్శనం క్యూబా. క్యాస్ట్రో ఉన్నా.. లేకున్నా.. ఆయన వేసిన విత్తనాలు మాత్రం చెట్లై ఫలాలు కాస్తూనే ఉంటాయి. అందుకే క్యాస్ట్రో ఓ మనిషి కాదు.. ఓ యోధుడు. ఓ శక్తి.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు