రఘువీరా.. కన్నడ నాట సక్సెస్ అవుతాడా?

రఘువీరా.. కన్నడ నాట సక్సెస్ అవుతాడా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రెవెన్యూ శాఖ మంత్రిగా ఉన్నా... అత్యంత కీలకమైన రాష్ట్ర విభజన అంశం గురించి రఘువీరారెడ్డి మారు మాట్లాడింది లేదు. రాష్ట్రం ఏమైపోతే ఏమి.. అన్నట్టుగా ఆయన వ్యవహరిస్తున్నాడు. ఇది ఆయనలోని నిర్వేదానికి కాదు.. వ్యూహానికి ప్రతీక అని తెలుస్తోంది! ఏపీ లో కాంగ్రెస్ గెలుస్తుందన్న ఆశలూ, తను తిరిగి పోటీ చేస్తే.. డిపాజిట్ దక్కుతుందన్న ఆశలూ హరించిన రఘువీరారెడ్డి వచ్చే ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడని సమాచారం.

రాయలసీమ లోని గొల్ల సామాజికవర్గానికి చెందిన రఘువీరారెడ్డి తన సామాజికవర్గం వారి సంఖ్య అధికంగా ఉండే తుముకూరు నియోజకవర్గంపై దృష్టి సారించినట్టు తెలుస్తోంది. అక్కడ కాంగ్రెస్ పార్టీకి కూడా అనుకూల పవనాలు ఉన్నాయనే అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో అనంతపురం జిల్లా నుంచి మళ్లీ పోటీ చేసి దెబ్బ తినడం కన్నా.. కొత్త చోటకు వెళ్లడమే మంచిదని రఘువీరా వ్యూహం రచించారట.

అందుకే ఆయన సమైక్యవాద ఉద్యమంలో పాల్గొనకపోవడం, దాన్ని పట్టించుకోకుండా ఉండటం చేస్తున్నాడని అంటున్నారు. అంతేగాక.. తనను కలిసిన సమైక్యవాదులకు  ఉద్యమాన్ని విరమించాలన్న ఉచిత సలహా కూడా ఇచ్చాడాయన! ఈ పరిణామాలన్నింటినీ బట్టి.. రఘువీర ఇక ఏపీ పై ఆశలను పూర్తి వదిలేసుకున్నాడని విశ్లేషకులు అంటున్నారు. మరి కన్నడ రాజకీయాల్లో ఈయన ఏ మేరకు రాణిస్తాడో!

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు