రూటు మారిన బ్లాకు నోటు

రూటు మారిన బ్లాకు నోటు

నల్లధనం నియంత్రణ కోసం కేంద్రం పెద్ద నోట్లు రద్దు చేసినా.. బ్లాక్ దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. నల్ల కుబేరులకు ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంక్ మేనేజర్లతో సహా పోస్టాఫీస్ సిబ్బంది కూడా అండగా నిలుస్తున్నారు. కమిషన్ల కక్కుర్తితో దేశ ఆర్థిక వ్యవస్థకు తూట్లు పొడుస్తున్నారు.
         
నగదు మార్పిడి గడువు మొదలైన మరుసటి రోజు నుంచే బ్లాక్ దందా మొదలైంది. ముందు ప్రైవేట్ బ్యాంకుల్ని ఆశ్రయించిన నల్లదొరలకు.. మేనేజర్లే పోస్టాఫీస్ దారి చూపించారట. పోస్ఠాఫీస్ పార్సిళ్ల మాటున నగదు బదిలీ ఈజీ అని చెప్పారట. తీగ లాగిన సీబీఐ దెబ్బకు.. డొంకంతా కదిలింది.
         
రెండు రోజుల క్రితం పోస్టాఫీసులపై సీబీఐ దాడుల వెనుక మర్మమిదేనని చర్చ జరుగుతోంది. కొన్ని పోస్టాఫీసుల్లో సిబ్బంది రెడ్ హ్యాండెడ్ గానే అధికారులకు దొరికిపోయారని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం దేశంలో గందరగోళ పరిస్థితి ఉంది కాబట్టి.. సీబీఐ బయటకు చెప్పడం లేదన్న మాట వినిపిస్తోంది.
          
డబ్బు లేక జనాల్లో భయాందోళనలు ఉన్న సమయంలో.. బ్లాక్ మనీ గురంచి చెబితే.. ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తుతుందని కేంద్రం భయపడుతోంది. ఇప్పటికే రోజుకో ప్రకటనతో చంపుతున్నారని భావిస్తున్న జనం.. అప్పుడే కొత్త నోట్లు పక్కదారి పట్టాయని తెలిస్తే వ్యవస్థపై నమ్మకం కోల్పోతారని నిపుణులు ఆందోళన చెందుతున్నారు.   

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు