ఇంట్లో బంగారం.. హుష్ కాకి

ఇంట్లో బంగారం.. హుష్ కాకి

ఇప్పటిదాకా మనకి గోల్డ్ రష్ గురించే తెలుసు. కానీ కొత్తగా కేంద్రం గోల్డ్ హుష్ అంటోంది. బ్లాక్ మనీకి ప్రధాన ఆధారం బంగారమే అని భావిస్తున్న కేంద్రం.. బంగారం నిల్వలపై పరిమితులు పెట్టే ఆలోచన కూడా చేస్తోంది. అంతా ఒట్టిదే అని అధికారులు ఖండిస్తున్నా.. గోప్యంగా కసరత్తు జరుగుతోందన్న అనుమానాలు వస్తున్నాయి.
           
మనందరి ఇళ్లల్లో బంగారం నిల్వ ఉంటుంది. అది స్థాయిని బట్టి ఉంటుంది. సాధారణ మధ్య తరగతి వారి ఇళ్లల్లో ఓ గోల్డ్ బిస్కెట్ ఉంటే ధనవంతుల ఇళ్లలో కేజీల కొద్దీ బంగారం మూలుగుతోంది. మహిళలకు బంగారంపై ఉండే మోజును ఆసరాగా చేసుకుని.. వ్యాపారులు కూడా ట్యాక్స్ ఎగ్గొట్టి మరీ దొంగతనంగా బంగారం దేశంలోకి దిగుమతి చేస్తున్నారు.
        
బంగారం అక్రమ వ్యాపారంతో ప్రభుత్వానికి ఆశించిన విధంగా ట్యాక్స్ రావడం లేదు. దిగుమతి సుంకం భారీగా పెంచినా.. వ్యాపారులు ఎగ్గొడుతున్నారు. దీంతో మొత్తం గోల్డ్ చైన్ నే కంట్రోల్ చేయాలని కేంద్రం కసరత్తు మొదలుపెట్టినట్లు తెలుస్తోంది. దేశంలో ఉన్న అన్ని కుటుంబాలు తమ ఇళ్లలో ఉన్న బంగారంపై సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.
        
సెల్ఫ్ డిక్లరేషన్ కు అనుగుణంగా ఇంట్లో బంగారం ఉంటే నో ప్రాబ్లమ్. ఏ మాత్రం తేడా ఉన్నా అధికారులు సీజ్ చేస్తారు. ఇప్పుడీ నిబంధన బంగారం వ్యాపారుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. అనుకున్న విధంగా గోల్డ్ హుష్ పాలసీ అమలు చేస్తే.. సగం బంగారం షాపులు మూసుకోవాల్సిందేనని ఆందోళన వ్యక్తమవుతోంది.

 

రాజకీయ వార్తలు

 

సినిమా వార్తలు